ఏ దేశం కూడా తమ దేశీయుల్ని దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాలని చెప్పే సాహసం చేయదు. అందరిలా ఉంటే స్వీడన్ గొప్పతనం ఏముంది చెప్పండి? అన్నట్లుగా ఉంది ఇప్పుడా దేశం తీసుకున్న నిర్ణయం. ఇక్కడ స్వీడన్ ను తప్పు పట్టే ఛాన్సు లేదు. ఆ దేశం వరకు.. తమ నిర్ణయం వెనకున్న లాజిక్ ను చెప్పేస్తున్నారు. దీంతో విమర్శలకు అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇంతకు వారు అమలు చేస్తున్న నిర్ణయానికి వస్తే.. తమ దేశాల్లోని ప్రజలకు ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదేమంటే..
వేరే దేశాల్లో పుట్టి ప్రస్తుతం స్వీడన్ లోనే స్థిరపడిపోవటం.. స్వీడన్ లోనే ఉండిపోవటం లాంటి వారికి ఒక ఆఫర్ ను ప్రకటించింది. దీని ప్రకారం స్వీడన్ లో స్థిరపడ్డ ఇతర దేశాల పౌరులకు కూడా వర్తింపచేస్తున్నారు. వీరు కానీ దేశాన్ని వీడితే వారికి.. వారి పిల్లలకు నజరానా ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఈ ఆసక్తికర విషయాన్ని స్వీడన్ ఇమ్మిగ్రేషన్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనార్గర్డ్ పేర్కొన్నారు.
స్వీడన్ లో నివసిస్తున్న వలసదారులు స్వచ్చందంగా దేశాన్ని వీడితే 10వేల స్వీడన్ క్రౌన్స్ (మన రూపాయిల్లో చెప్పాంటే రూ.80 వేలు) ఇస్తారు. ఆ కుటంబంలో చిన్నారులు ఉంటే.. పెద్ద వారికి ఇచ్చే మొత్తంలో యాభై శాతం అందజేస్తారు. అంతేకాదు.. సదరు కుటుంబం వారు దేశాన్ని విడిచి పెట్టి వెళుతున్న వేళలో.. ఎయిర్ టికెట్లు కూడా ఇవ్వనున్నారు. ఇంతకాలం ఈ ఆఫర్ వలసదారులకు మాత్రమే అమలు చేశారు.
తర్వాత చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో వలసదారులకు మాత్రమే కాదు తమ దేశంలో ఉండిపోయిన వారికి కూడా ఇదే రకమైన ఆఫర్ ను ఇవ్వటం గమనార్హం. దేశంలో జనాభా పెరిగిన నేపథ్యంలో .. జనాభా సంఖ్యను తగ్గించటమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఇంత భారీ మొత్తాన్ని ఆఫర్ గా ఇచ్చేయటం గమనార్హం. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి స్వీడన్ కు రావటం తెలిసిందే.
గడిచిన 20 ఏళ్ల వ్యవధిలో స్వీడన్ కు వచ్చి సెటిల్ అయిపోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న దుస్థితి. 2015లో వలసలపై అంక్షలు పెట్టినప్పటికి పెద్దగా ప్రభావం చూపని పరిస్థితి. దీంతో.. జనాభా నియంత్రణ కోసం దేశ ప్రధాని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ నిర్ణయాన్ని పలు దేశాల ప్రజలు తప్పు పడుతున్నారు.
స్వీడన్ ప్రభుత్వం తమ దేశ పౌరుల్ని.. వలసవాదుల్ని తగ్గించుకోవటానికి నిర్ణయం తీసుకున్న తీరును తప్పు పట్టుకున్నా.. ఇది ఎలాంటి ప్రజాస్వామాన్ని సూచిస్తుందన్నది అర్థం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ సోషల్ మీడియా కామెంట్ ను పోస్టు చేశారు. దేశ పౌరుల్ని దేశాన్ని విడిచి పెట్టి వెళ్లాలని కోరటం సరైనది కాదంటున్నారు. ఇంత విమర్శలు ఉన్న వేళ.. ఈ ఇష్యూను ఎలా పూర్తి చేస్తారో చూడాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.