అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దివంగత మహానేత వైఎస్ కు స్వయాన సోదరుడు.. ఏపీ సీఎం జగన్ కు సొంత బాబాయ్ అయిన వైఎస్ వివేక దారుణ హత్యకు గురై రెండేళ్లు కావొస్తోంది. ఇలాంటివేళ.. ఆయన కుమార్తె కమ్ డాక్టర్ సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. తన తండ్రి దారుణహత్యకు గురై రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు ఒక్క అరెస్టు జరగలేదని.. తమకు న్యాయం జరగాలని.. నిందితుల్ని వెంటనే పట్టుకోవాలని ఆమె కోరుతున్నారు.రాష్ట్రపతి భవన్ మొదలు న్యాయం కోసం ఆయన ఎక్కని గడప లేదనే మాటను ఆమె చెప్పారు. తన తండ్రిని తమ ఇంట్లోనే దారుణహత్యకు పాల్పడిన వారిని గుర్తించాలని తాను పోరాడుతుంటే.. తనకే బెదిరింపులు వస్తున్నాయని సంచలన వ్యాఖ్య చేశారు. పోయినోళ్లు ఎటూ తిరిగి రారు.. ఉన్నోళ్లకు ఏమైనా అయితే ఎలా? అని హెచ్చరిస్తున్నారని చెప్పటం షాకింగ్ గా మారింది. తమది పెద్ద కుటుంబమే అయినప్పటికీ.. వారి నుంచి సపోర్టు అనుకున్నంతగా రాలేదని.. కొందరు మాత్రం చాలా బలమైన వారు తనకు మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు. డాక్టర్ గా ఉన్న తాను.. రోగుల్ని చూసుకుంటే సరిపోతుందని.. తనకు రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదన్నారు. ఇక.. అనుమానితుల పేర్లను ఆమె చదివి వినిపించారు. తన తండ్రి దారుణహత్యకు కారణమని భావిస్తున్న నిందితుల పేర్లు పిటిషన్ లోనే ఉన్నాయన్న ఆమె.. ఆ పేర్లను చెప్పారు. వాటిని చూస్తే..
వాచ్‌మన్ రంగన్న
ఎర్ర గంగిరెడ్డి
ఉదయ్‌కుమార్ రెడ్డి
శివశంకర్ రెడ్డి
అవినాశ్ రెడ్డి (ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్నారు)
భాస్కర్ రెడ్డి
మనోహర్ రెడ్డి
ఆదినారాయణ రెడ్డి
రవీంద్రనాథ్ రెడ్డి
పరమేశ్వర్ రెడ్డి
సురేంద్ర నాథ్ రెడ్డి
సురేందర్ రెడ్డి
హత్యాస్థలంలో రక్తం తుడుస్తున్నప్పుడు అక్కడే ఉన్న సీఐ.. ఎస్ఐలు