వైఎస్సార్సీపీలో బాలినేని – సుబ్బారెడ్డిల మధ్య గొడవ తారా స్థాయికి చేరిందా?
ఎవరికి వారు తమ హవా నడిపించాలని అనుకుంటున్నారా ?
టిటిడి చైర్పర్సన్ వైవి సుబ్బారెడ్డి కి బావ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.
వైఎస్ జగన్ తల్లి విజయలక్ష్మికి బాలినేని సోదరుడు అవుతాడు. వైవీ సుబ్బారెడ్డి బంధుత్వం గురించి తెలిసిందే.
వీరిద్దరూ ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరులో పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి కావాలనుకునే వైవీ సుబ్బారెడ్డి తన ప్రత్యర్థిని ఉపయోగించుకుని బాలినేనిపై దాడికి ప్రయత్నిస్తున్నారనేది ఇప్పుడు బహిరంగ రహస్యం.
ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఇటీవల బాలినేని అనుచరుడు సుభాని చేతిలో దాడికి గురైన వైఎస్ఆర్సిపి కార్యకర్త సుబ్బారావు గుప్తా గురించి తెలుసు కదా.
అతన్ని వైవీ సుబ్బారెడ్డి చేరదీశాడట.
వైవీ సపోర్ట్‌తోనే గుప్తా మళ్లీ మళ్లీ విలేకరుల సమావేశాలు పెట్టి బాలినేనిపై విరుచుకుపడుతున్నారని రాజకీయ ఆంతరంగిక వర్గాలు చెబుతున్నాయి.
వీరిద్దరి పోరులో గుప్తా హీరోగా మారాడు. గుప్తాని వాడుకుని బాలినేనిని వైవీ బాగానే డ్యామేజ్ చేస్తున్నాడని సొంత పార్టీలో చర్చ జరుగుతోంది.
తాజాగా సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలు చూస్తే అతని ధైర్యానికి అందరూ ముచ్చటపడుతున్నారు. ఇపుడు ఏకంగా బాలినేనిని నేరుగా టార్గెట్ చేస్తున్నాడు గుప్తా.
శత్రువులను , నచ్చని వారిని ఎలా అణగదొక్కాలో హింసించాలో కొడాలి నాని బాలినేని దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
వైవీ సుబ్బారెడ్డి నుంచి వచ్చిన సపోర్ట్ వల్లనే సుబ్బా రావు గుప్తా అంత ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.