“ఏపీలో అడుగడుగునా ప్రభుత్వ ఉగ్రవాదం కనిపిస్తోంది.. రోజుకో ఘోరం తెరమీదికి వస్తోంది. దీంతో ప్రజ లు శాంతి సామరస్యాలతో జీవించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు“అని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తాజాగా ఆయ న ఏపీ ప్రభుత్వ తీరును విమర్శించారు. గడిచిన వారంలో రాష్ట్రంలో జరిగిన ఘోరాలు-నేరాలను చంద్రబాబు వివరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో రోజుకో ఘోరం… ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం కనిపిస్తోందని ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రోడ్డు నిర్మించమని అడిగిన కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. ఇంత కన్నా ఘోరం ఏముంటుందని నిరసించారు. అదేవిధంగా తనకు పింఛను కావాలని కోరిన మహిళపై అక్రమ కేసు పెట్టి బెదిరించారని.. ఇదేనా రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్న భద్రత? అని ప్రశ్నించారు.
వస్త్ర వ్యాపారులపై విజయవాడలో వైసీపీ రౌడీలు దాడి చేసిన ఘటనను ప్రజలు సైతం ఛీత్కరిస్తున్నార ని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘బకాయిలు చెల్లించాలని కోరినందుకు ధర్మవరానికి చెందిన చేనేత వర్గ వస్త్ర వ్యాపారులపై విజయవాడలో వైసీపీ గూండాలు అమానుష దాడికి పాల్పడ్డారు… బాధితులను నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం పొందారు. రోడ్డు వేయమని ఉపముఖ్యమంత్రిని అడిగిన పాపానికి చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన కానిస్టేబుల్‌పై కేసు పెట్టారు.. సస్పెండ్ చేశారు“ ఇది ప్రభుత్వ ఉగ్రవాదం కాదా? అని నిలదీశారు.
ప్రకాశం జిల్లాలో పింఛను డబ్బు అడిగిన వితంతు మహిళపై కేసు పెట్టారని చంద్రబాబు నిప్పులు చెరిగా రు. రోజుకో ఘోరం.. ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు శాఖను వైసీపీ అనుబంధ విభాగంగా మార్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని విమర్శించారు.
జగన్ ప్రభుత్వానికి తమ పాలన, నేతల పోకడలపై ప్రజలు ఏమనుకుంటారో అనే స్పృహ లేదని విమర్శించారు. కానీ, ప్రభుత్వ నిర్వాకాన్ని.. సీఎం వ్యవహారాన్ని ఈ సమాజం గమనిస్తోందని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ ప్రభుత్వ పాపాలకు ప్రజలు తిరుగులేని గుణపాఠం చెప్పడం మాత్రం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.