సీసీ కెమేరాకు చూపిస్తూ లంచాన్ని తీసుకున్న అధికారిణి.. అడ్డంగా బుక్ అయ్యారుగా

ఎంత ధీమా కాకపోతే లంచాన్ని తీసుకుంటూ సీసీ కెమేరాకు చూపిస్తారు? కొంతకాలంగా పని చేయని సీసీ కెమేరా హటాత్తుగా పని చేయటం ప్రారంభించటం.. ఇదేమీ తెలియన మహిళా అధికారి ఒకరు లంచం తీసుకునే వేళ.. వ్యవహరించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. సీసీ కెమేరాకు చూపించి మరీ లంచాన్నితీసుకున్న వైనం వైరల్ వీడియోగా మారింది. మరీ.. అంత తెలివి తక్కువగా సదరు మహిళా అధికారి ఎలా వ్యవహరించారన్న విషయంలోకి వెళితే..


ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు బి.కుసుమ కుమారి. ఆమె తీరుపై పలు ఆరోపణలు ఉన్నాయి. పలువురు కంప్లైంట్లు చేశారు. అయితే.. అందుకు తగ్గ ఆధారాలు లభించని పరిస్థితి. ఇలాంటివేళ.. అనూహ్యంగా ఆమె లంచావతారం ఎలా ఉంటుందన్న విషయాన్ని సీసీ కెమేరా ఫుటేజ్ బయటపెట్టేసింది. ఒక కంపెనీకి అనుమతి ఇవ్వటం కోసం ఆమె లంచాన్ని తీసుకోవటమే కాదు.. డబ్బులు చేతికి తీసుకొని.. ఎదురుగా ఉన్న సీసీ కెమేరాకు చూపిస్తూ నవ్వేసిన వైనం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.


అయితే.. సీసీ కెమేరా పని చేయటం లేదన్న ధీమాతో ఆమె వ్యవహరిస్తే.. సదరు సీసీ కెమేరా పని చేయటం ఆమెకు తెలీదు. దీంతో ఆమె భాగోతం మొత్తం గుట్టుగా రికార్డు అయ్యింది. ఇదిలా ఉంటే.. కుసుమపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ డి. చంద్రశేఖర వర్మ తాజాగా సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలించారు. అందులో కుసుమ కుమారి లంచం తీసుకుంటూ ఉండగా కెమేరాలకు చూపిస్తూ లంచాన్ని తీసుకున్న వైనం దర్శనం ఇవ్వటంతో సదరు ఉన్నతాధికారి స్పందించి.. ఆమెను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఎంత బరితెగింపు కాకపోతే.. లంచం తీసుకునే వేళ.. కెమేరాకు చూపించి మరీ కామెడీ చేసుకోవటమా? అందుకేనేమో కెమేరాకు కోపం వచ్చి.. తానేమిటో చూపించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.