ప్రముఖ తమిళ సినిమా నటులైన విజయ్ కుమార్, మంజుల దంపతుల చిన్న కుమార్తె శ్రీదేవి విజయ్ కుమార్ ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ సినీ ప్రియులకు శ్రీదేవి అత్యంత సుప్రసిద్ధురాలు. తల్లిదండ్రులు ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో.. ఏడేళ్లకే శ్రీదేవి తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. 1992లో వచ్చిన `రిక్షా మామా` అనే తమిళ చిత్రంతో బాలనటిగా తొలిసారి వెండితెరపై మెరిసింది.
1997 వరకు పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రీదేవి.. 2002లో ప్రభాస్ డెబ్యూ మూవీ `ఈశ్వర్`తో హీరోయిన్గా మారింది. తొలి సినిమాతో తనదైన అందం, అభినయం, మైమరపించే చిరునవ్వుతో తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి బాగా దగ్గరైంది. ఈశ్వర తర్వాత తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో హీరోయిన్ గా 2009 వరకు గ్యాప్ లేకుండా సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అదే ఏడాది రాహుల్ అనే వ్యాపారవేత్తను శ్రీదేవి వివాహం చేసుకుంది. 2016లో ఈ దంపతులకు ఒక కూతురు జన్మించింది.
వివాహం అనంతరం సహాయక నటిగా అడపా తడపా చిత్రాల్లో కనిపించిన శ్రీదేవి.. 2021 నుండి టెలివిజన్ రంగంలో యాక్టివ్ అయింది. తెలుగు, తమిళ భాషల్లో పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ సత్తా చాటుతోంది. ఇక సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే శ్రీదేవి.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
సినిమా అవకాశాలు తగ్గిపోయినా.. పెళ్లై, ఒక బిడ్డకు తల్లైన కూడా శ్రీదేవి గ్లామర్ చెక్కుచెదరలేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. బ్లాక్ కలర్ ట్రెండీ శారీలో శ్రీదేవి మిస్మరైజ్ చేసింది. ఆమె అందాల కవ్వింపులకు కుర్ర భామలు సైతం విలవిలమంటున్నారు. ఏజ్ పెరుగుతున్న శ్రీదేవి అందం మాత్రం తరగడం లేదని నెటిజన్లు అభిప్రాయపడటం గమనార్హం.
View this post on Instagram