స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఏపీలో పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు. తమ్మినేని నాలుగు దశా బ్ధాలుగా రాజకీయాలు చేస్తున్నారు. మొదట టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన సీతారాం.. తర్వాత.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీవైపు అడుగులు వేశారు.
అయితే.. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత.. పార్టీని కాంగ్రెస్లో విలనం చేయడంతో తమ్మినేని వైసీపీ వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కింది.
ఇష్టం లేకుండానే!
తమ్మినేనికి స్పీకర్ పదవిపై మొదటి నుంచీ అంతగా ఆశక్తి లేదు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి వస్తుం దని ఆశించారు. అధికార పార్టీ నేతల్లో ఆయన సీనియర్ కూడా కావడంతో మంత్రి వర్గంలో ఆయనకు బెర్త్ ఖాయమని అందరూ అనుకున్నారు. చివరి నిమిషంలో ఊహించని విధంగా తమ్మినేనిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. వాస్తవానికి తమ్మినేని శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ లీడర్.
అముదాలవలస నుంచి దశాబ్ధ కాలం విరామం తర్వాత, ఎమ్మెల్యేగా గెలుపొందారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో ఆయన అనుచరులు అప్పట్లో తమ నాయకుడికి మంత్రిపదవి ఖామమని బావించారు. కానీ చివరి నిమిషంలో స్పీకర్ పదవి దక్కింది. అయిష్టంగానే స్పీకర్ పదవిని నెట్టుకొస్తున్నారు.
`స్పీకర్` సెంటిమెంటు వెంటాడుతోందా?
తమ్మినేనికి మళ్లీ కేబినెట్ ఆశలు చిగురిస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత జగన్ తన మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయనున్న నేపథ్యంలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదిలావుంటే, సభాపతి స్ధానాన్ని తమ్మినేని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారు అనే సందేహాలు కామన్.
దీనికి పరిశీలకులు ఏం చెబుతున్నారంటే.. గతంలో స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించిన పలువురు నేతలు రాజకీయాలకు దూరమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్లుగా పని చేసిన కావలి ప్రతిభాభారతి, కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ పాలికిట్స్ దూరమయ్యారు. దీంతో అలాంటి పరిస్ధితే తనకు కూడా వస్తుందేమో అన్న టెన్షన్ లో తమ్మినేని ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు.
టీడీపీ హయాంలోనే గుర్తింపు!
టీడీపీలో ఉన్నప్పడు ఎన్టీఆర్, చంద్రబాబుల హాయంలో సీతారాం మంత్రిగా పని చేశారు. అనంతర రాజకీయ పరిణామాల్లో తమ్మినేని పార్టీలు మారుతూ వచ్చారు. ఎన్నో కీలక పదవులు అనుభవించిన సీతారాం.. మళ్లీ మంత్రి పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక కామెంట్లు చేస్తూ.. అవకాశం వచ్చిన ప్రతిసారీ.. జగన్ను, ఆయన పాలనను ఆకాశానికి ఎత్తుతున్న స్పీకర్.. తమ్మినేని.. అదే మంత్రి పదవి అయితే.. మరింత దూకుడు చూపొచ్చని.. ప్రత్యక్షంగా.. మరింత హాట్ కామెంట్లు చేసేందుకు, అధికారం చలా యించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి జగన్ తమ్మినేని కోరికను నెరవేరుస్తారో లేదో చూడాలి.