బెంగళూరులో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో అపశృతి జరిగింది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు అభిమానులు మృతి చెందన ఘటన కలచివేసింది. తొక్కిసలాటలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా…వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 15 మంది అభిమానులు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. దీంతో, చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టుున సన్మానించాలని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. స్టేడియంలో సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. గ్రౌండ్ వరకు విక్టరీ పరేడ్ నిర్వహించగా…స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. స్టేడియంలోకి వెళ్లేందుకు అభిమానులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది.
పరిస్థితి అదుపు తప్పి అభిమానులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఊపిరి ఆడక ఆరుగురు అభిమానులు మృతి చెందగా..మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే, విక్టరీ పరేడ్ కు భద్రత కల్పించలేమంటూ పోలీసులు ముందుగానే ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని చెప్పేశారు.