ప్రముఖ స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కల్పన నిద్ర మాత్రలు వేసుకుని అపస్మారకస్థితిలో వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. సరైన సమయంలో ఆమెను పోలీసులు హాస్పిటల్ కు తరలించగా.. వైద్యులు కల్పనను సేవ్ చేశారు. ప్రస్తుతం కల్పన కోలుకుంటోంది. అయితే మీడియాలో కల్పన ఆత్మహత్యకు పాల్పడిందని రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆవిడ భర్త ప్రసాద్ ప్రభాకర్, కూతురు దయపై తప్పుడు కథనాలు వెలువడ్డాయి.
అయితే తాజాగా కల్పన సోషల్ మీడియా వేదికగా ఏం జరిగిందో వివరిస్తూ ఓ వీడియో పంచుకున్నారు. `మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పుడు ప్రచారం సర్క్యులేట్ అవుతుంది. ఆ విషయం పై క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం నాకు 45 ఏళ్లు. ఈ ఏజ్ లో పీహెచ్డీ చేస్తున్నాను. ఎల్ఎల్బీ చదువుతున్నాను. ఇదంతా నా భర్త ఎంకరేజ్మెంట్ వల్లే జరుగుతుంది. గత కొద్దిరోజులుగా మ్యూజికల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడంతో నిద్ర పట్టక ఎంతో ఇబ్బంది పడుతున్నాను. వర్క్ స్ట్రెస్డ్ చాలా ఎక్కువగా ఉంది.
నిద్రలేమి సమస్యకు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు నాకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ను ఆరోజు కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను. కానీ ఈరోజు మీ ముందు నేను జీవించి ఉన్నానంటే అందుకు కారణం నా భర్తే. ఆయన సరైన సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చి నన్ను కాపాడారు. మీడియాలో మా ఫ్యామిలీ గురించి జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవం.
నాకు ఎటువంటి పర్సనల్ ఇష్యూస్ లేవు. దేవుడు దయవల్ల మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. తప్పుడు ప్రచారం స్ప్రెడ్ చేయవద్దు. నిజానికి నా భర్త, నా కూతురు నా లైఫ్ లో ఉండడం దేవుడు ఇచ్చిన వరం. మేము హ్యాపీగా ఉన్నాము. హెల్త్ ఇష్యూస్ వల్లే ఇలా జరిగింది. మళ్లీ పాడడానికి, మిమ్మల్ని సంతోష పెట్టడానికి త్వరలోనే రికవరీ అవుతాను. నన్ను కాపాడటానికి కృషి చేసిన పోలీసులు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నా క్షేమం కోరుకున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు` అని కల్పన వీడియోలో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
భర్తతో విభేదాలు లేవు: గాయని కల్పన
'నా భర్తతో ఎలాంటి విభేదాలు లేవు. ఒత్తిడివల్ల నిద్రలేమి సమస్య ఎదురవడంతో, డాక్టర్ సలహా మేరకు మెడిసిన్ వాడుతున్నాను.
అయితే, దాని డోస్ ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను.'
– గాయని కల్పన#KalpanaRaghavendar #Kalpana #SingerKalpana… pic.twitter.com/prhakmnEfa
— Tupaki (@tupaki_official) March 7, 2025