స్టార్ బ్యూటీ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాలు ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సమంత నిర్మాణంలో వచ్చిన తొలి చిత్రం `శుభం` పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలచింది. శుభం సక్సెస్ తో సమంతతో సహా మూవీ టీమ్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. రీసెంట్ గా శుభం సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించారు.
అయితే ఈ ఈవెంట్ లో సమంత-రాజ్ రిలేషన్‌ను ప్రముఖ తెలుగు నటి మధుమణి దాదాపు కన్ఫామ్ చేసేసారు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న మధుమణి.. 400 చిత్రాల్లో నటించారు. ఎందరో హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలను పోషించారు. కానీ సమంతతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాలేదట. రంగస్థలంలో సమంతకు తల్లిగా నటించే ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిందని.. అయితే ఆమెతో కలిసి యాక్ట్ చేయాలన్న తన కోరిక శుభంతో నెరవేరిందని మధుమణి ఆనందం వ్యక్తం చేశారు.
శుభం షూటింగ్ ప్రారంభమైన రోజే తాను చికెన్ గున్యా బారిన పడ్డానని.. ఛాన్స్ మిస్ అవుతుందేమోనని చాలా బాధపడ్డాను.. లక్కీగా నాలుగు నెలల తర్వాత మళ్లీ శుభంతో తన ప్రయాణం మొదలైందని.. ఈ అవకాశం కల్పించిన సమంతకు కృతజ్ఞతలు అంటూ మధుమణి పేర్కొన్నారు. అలాగే సెట్స్ లో సమంత అందరినీ ఎంతో బాగా చూసుకున్నారని మధుమణి కొనియాడారు. సమంత, రాజ్ శుభంతో ఈ జర్నీ మొదలు పెట్టారు. శుభంగా ఇలాగే ఎల్లవేళలా హ్యాపీగా ఉండాలి..శతమానం భవతి అంటూ స్టేజ్‌పైనే నుంచే మధుమణి ఆశీర్వదించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సమంత, రాజ్ రిలేషన్ ను మధుమణి కన్ఫార్మ్ చేసేశారని నెటిజన్లు భావిస్తున్నారు.