ప్రపంచాన్ని వణికించే పెద్దన్న అమెరికా ప్రభుత్వాన్ని.. అప్పుడప్పుడు ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువులు తాగిస్తూ ఉండే సత్తా ఆ దేశ సెనేట్ దే. అందులోకి అక్కడ.. మెజార్టీ లేని బైడెన్ సర్కారు లాంటి ఉండే అలాంటివి మరింత ఎక్కువగా ఉంటాయి. కొన్ని రోజులుగా అగ్రరాజ్యానికి దివాలా ముప్పు ఉందంటూ జోరు కథనాలు రావటం తెలిసిందే. అప్పుల పరిమితి పెంపునకు సంబంధించిన కీలక బిల్లుకు సెనేట్ ఆమోదం లభించకపోతే.. దారుణ పరిస్థితులు చోటు చేసుకోవటం ఖాయం.
అయితే.. ఆ టెన్షన్ ను అలానే కంటిన్యూ చేస్తూ.. చివరి నిమిషంలో పెద్ద మనసుతో సెనేట్ ఓకే చెప్పేయటం.. హమ్మయ్యా అంటూ గండం గట్టెక్కినట్లుగా ఫీల్ కావటం మామూలే. మీడియా కథనాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. చూస్తూ.. చూస్తే.. తమ దేశాన్ని దివాలా ఎత్తించేందుకు ఏ దేశ విపక్షమైనా సిద్ధమవుతుంది. అదే జరిగితే.. ఆ దేశ ప్రజలు ఆ రాజకీయ పార్టీని ఎప్పటికి క్షమించరుకదా?
అలానే.. అమెరికా సెనేట్ లోనూ అప్పుల పరిమితి పెంచుకోవటానికి వీలుగా కీలక బిల్లుకు ఆమోదముద్ర వేసింది. బైడెన్ సంతకం లాంఛనమే కావటంతో.. బిల్లు వెంటనే చట్టరూపం దాల్చినట్లేనని చెబుతున్నారు. 2012 నాటికి అమెరికన్ ప్రభుత్వం తీసుకున్న అప్పు అక్షరాల 28.5 లక్షల కోట్ల డాలర్లు. మన రూపాయిల్లో చెప్పాలంటే.. రూ.23,53,09,680 కోట్లుగా చెప్పాలి. అమెరికా జీడీపీకి ఇది 24 శాతం ఎక్కువ.
ఈ మొత్తంలో ఎక్కువగా దేశీయ వ్యక్తులు. సంస్థల నుంచి సేకరించగా.. 7 లక్షల కోట్ల మొత్తాన్నివిదేశాల నుంచి సేకరించారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమిది 31.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటే.. తాజాగా బిల్లుఆమోదంతో అంతకు మించి అప్పులు చేసేందుకు బైడెన్ సర్కారుకు వెసులుబాటు కలుగనుంది. ఈ అప్పు పరిమితిని పెంచేందుకు సెనేట్ ససేమిరా అనటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్పునకు కాదంటే.. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవటమేకాదు.. దాని ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా దారుణ పరిస్థితులు నెలకొంటాయి. మొత్తంగా సెనేట్ పెద్ద మనసుతోపెద్ద గండం గడిచినట్లుగా చెప్పాలి. అయితే.. ఈ బిల్లు ఆమోదానికి ముందు అధ్యక్షుడు బైడెన్.. స్పీకర్ కెవిన్ మెకార్థీ మధ్య సుదీర్ఘంగా చర్చలు జరగటం గమనార్హం.