ఏపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో టీడీపీ నేతృత్వంలోని కూటమి విజయం దక్కించుకుంటుందని సర్వేలు వెల్లడించాయి. భారీ విజయం ఖాయమని పేర్కొన్నాయి. ఈ అంచనాలు వచ్చి 24 గంటలు కూడా.. గడవక ముందే.. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు భారీగా భద్రత పెంచారు. 100 మంది కానిస్టేబుళ్లు.. 20 మంది ఎస్సైలు,, ఐదుగురు సీఐలు, ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరోవైపు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కూడా.. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రత ను కట్టుదిట్టం చేశారు. దీంతో చంద్రబాబు కూటమి గెలుపును అధికారికంగా గుర్తించారా? అనే చర్చ సాగుతోంది. అయితే.. ఎన్నిక లసంఘం ఆదేశాలతోనే తాము భద్రత కల్పించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై రెండు రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకటి.. ఎగ్జిట్ పోల్స్‌లో చంద్రబాబు కూటమి గెలుస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ భద్రతను పెంచారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరికొందరు మాత్రం.. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అలజడి రేగకుండా చూసేందుకు.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయం.. ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటికి భద్రత కల్పించడం.. పోలీసుల బాధ్యత అని అందుకే భారీ భద్రతను కల్పిస్తున్నట్టు చెబుతన్నారు. ఇంకోవైపు.. కౌంటింగ్ సందర్భంగా.. అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని.. కాబట్టి తమ కార్యాలయానికి.. ఇంటికి కూడా భద్రత కల్పించాలంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖ ఆధారంగా.. ఎన్నికల అధికారులు భద్రత కల్పించారని పేర్కొంటున్నారు.
ఏదేమైనా… ఇటు టీడీపీ కార్యాలయానికి అరకిలోమీటరు వరకు.. పోలీసులు మోహరించారు. అటు ఉండవల్లిలోని కరకట్ట వెంబడి కిలో మీటరు దూరం వరకు.. అటు ఇటు.. కూడా.. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని.. తనిఖీ చేస్తున్నారు. కౌంటింగ్ జరిగే రోజు.. చంద్రబాబు నివాసం ఉన్న ఉండవల్లి కరకట్ట వెంబడి వాహనాల రాకపోకలను నిలిపి వేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.