న్యాచురల్ స్టార్ నాని రేపు `సరిపోదా శనివారం` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు కాగా.. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తే.. విలక్షణ నటుడు ఎస్.జె సూర్య విలన్ గా యాక్ట్ చేశాడు. ఆగస్టు 29న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సరిపోదా శనివారం గ్రాంగ్ రిలీజ్ కాబోతోంది.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. నాని గత చిత్రాలు దసరా, హాయ్ నాన్న మంచి విజయం సాధించడంతో.. సరిపోదా శనివారం మూవీకి సాలిడ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సరిపోదా శనివారం థియేట్రికల్ రైట్స్ రూ. 30 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది.
నైజాంలో రూ. 12.50 కోట్లు, సీడెడ్ లో రూ. 5 కోట్లు, ఆంధ్రాలో రూ. 12.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. అలాగే వరల్డ్ వైడ్ గా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 41 కోట్లు. ఈ లెక్కన బాక్సాఫీస్ వద్ద సినిమా క్లీన్ హిట్ గా నిలవాలంటే రూ. 42 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. టాక్ పాజిటివ్ గా ఉంటే నానికి ఇదేమి పెద్ద టార్గెట్ కాదనే చెప్పొచ్చు.