సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాల హడావుడి నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ఈ ఏడాది కూడా మూడు పెద్ద చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన `సంక్రాంతికి వస్తున్నాం` ఒకటి కాగా.. మరొకటి రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్`, ఇంకొకటి బాలకృష్ణ నటించిన `డాకు మహారాజ్`. వీటిల్లో గేమ్ ఛేంజర్ మూవీకి యావరేజ్ టాక్ వస్తే.. మిగతా రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి వెంకీ ని సంక్రాంతి విన్నర్ గా నిలబెట్టింది.
4వ రోజు కలెక్షన్స్ తో భారీ లాభాలను అందుకుంది. జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం.. నాలుగు రోజుల రన్ ముగిసే సమయానికి ఏపీ మరియు తెలంగాణలో రూ. 56.45 కోట్ల రేంజ్ లో షేర్, రూ. 84.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. అలాగే ఓవర్సీస్ లో దాదాపుగా రూ. 7.45 కోట్లు కొల్లగొట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. నాలుగు రోజుల్లో వెంకీ మూవీ రూ. 67.75 కోట్ల షేర్, రూ. 110.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42.50. విడుదలైన మూడు రోజుల్లోనే వెంకీ ఈ టార్గెట్ ను రీచ్ అయ్యారు. నాలుగో రోజు కలెక్షన్స్ తో ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా రూ. 25.25 కోట్ల లాభాలతో సక్సెస్ ఫుల్గా ముందుకు సాగుతూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో వెంకీకి భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటించారు. ప్రస్తుతం సినిమాకు వస్తున్న ఆదరణ దృష్ట్యా చిత్రం బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లో అదనంగా 220+ షోలను ప్రదర్శించేందుకు రెడీ అయ్యారు.