రష్మిక మందన్నా.. మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ కన్నడ సోయగం `కిరిక్ పార్టీ`తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. ఈ మూవీ సమయంలోనే రక్షిత్ తో ప్రేమలో పడిన రష్మిక.. అతడిని వివాహం చేసుకోవాలనుకుంది. 2017లో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ, పెళ్లి వరకు వెళ్లకుండానే రక్షిత్-రష్మికలు విడిపోయారు. ఆ తర్వాత కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన రష్మిక.. `ఛలో` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు.. రష్మికకు మంచి గుర్తింపు కూడా దక్కింది. ఈ మూవీ అనంతరం వరుస హిట్ చిత్రాలు చేస్తూ.. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అదే సమయంలో నేషనల్ క్రష్ గా ముద్ర వేయించుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పాన్ ఇండియా మూవీ `పుష్ప`తో రష్మిక స్టార్డమ్ మరింత పెరిగిపోయింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇకపోతే తెలుగు హీరోయిన్ కాకపోయినా.. తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో రష్మిక ఒకరు. తెలుగులోనే కాదు మిగిలిన భాషల్లోనూ ఎంతో కష్టపడి తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
`పుష్ప` సినిమాలోనూ రష్మికనే డబ్బింగ్ చెప్పుకుంది. పక్కా చిత్తూరు స్లాంగ్ లో అద్భుతంగా డైలాగ్స్ పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే డబ్బింగ్ విషయంలో మాత్రం రష్మిక ముందు సమంత కూడా దిగదుడుపే అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సమంత టాలీవుడ్ లోకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. తెలుగులో మాట్లాడటం కూడా ఆమెకు బాగా వచ్చు. అయినప్పటికీ, తన సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం మాత్రం చాలా అరుదు.
`మహానటి`, `యూటర్న్` తదితర చిత్రాలకు డబ్బింగ్ చెప్పింది. కానీ, ఆమె వాయిస్ లో సరైన స్పష్టత లేకపోవడం వల్ల.. చాలా విమర్శలు వచ్చాయి. అందుకే సమంతకు చిన్మయినే ఎక్కువగా వాయిస్ అందిస్తుంటుంది. కానీ, రష్మిక ఇండస్ట్రీకి వచ్చి కొన్నేళ్లే అయినా.. కష్టపడి భాష నేర్చుకుని తాను నటించే సినిమాల్లో తానే డబ్బింగ్ చెప్పుకుంటూ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది.
Comments 1