సౌత్ స్టార్ బ్యూటీ సమంత కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయినప్పటికీ.. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా స్ట్రగ్గుల్స్ ను ఫేస్ చేసింది. తన మొదటి సినిమా హీరో అయిన నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత.. 2017లో అతనితో కలిసి పెద్దల సమక్షంలో ఏడడుగులు వేసింది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. నాలుగేళ్లకే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. సమంతతో విడిపోయిన కొత్త కాలానికి ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో రిలేషన్ షిప్ స్టార్ట్ చేసిన చైతూ.. గత ఏడాది డిసెంబర్ లో ఆమెను రెండు వివాహం చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు.
అయితే తాజాగా చైతూ రెండో వివాహం పై తొలిసారి సమంత రియాక్ట్ అయింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు నాగ చైతన్య రెండో వివాహం పై ప్రశ్న ఎదురైంది. `మీ మాజీ భర్త కొత్త బంధంలోకి అడుగు పెట్టినందుకు మీరేమైనా అసూయ పడుతున్నారా? అని ప్రశ్నించగా.. అందుకు సమంత `నా లైఫ్ లో అసూయకు తావులేదు. జీవితంలో అన్ని అనర్థాలకు మూలం అసూయనే అని నేను భావిస్తాను. అందువల్ల గతంలో నాతో రిలేషన్షిప్ లో ఉన్న వారిపై నాకెలాంటి కోపం, అసూయ లేవు. అలాంటి వాటి గురించి ఆలోచించను కూడా` అంటూ సమాధానం ఇచ్చింది.
ఇక ఇదే ఇంటర్వ్యూలో నాగచైతన్యతో రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేందుకు ఎంతో శ్రమించానంటూ సమంత తెలిపింది. ప్రస్తుతం సామ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, విడాకులైన కొంత కాలానికే సామ్ ను పలు హెల్త్ ఇష్యూస్ వెంటాడాయి. వాటి కారణంగా చాలా రోజుల పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడిప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతోంది. ప్రస్తుతం `మా ఇంటి బంగారం` మరియు `రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్` వంటి ప్రాజెక్ట్స్ తో సమంత బిజీగా ఉంది.