భర్త నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత, సమంత రూత్ ప్రభు ఇన్‌స్టాగ్రామ్‌లో స్ఫూర్తిదాయకమైన సందేశాలను పంచుకుంటున్నారు.
ఈ రోజు, (నవంబర్ 2 ) ‘నేను బలంగా ఉన్నాను’ అంటూ మరొక అఫర్మేషన్ పోస్ట్ పెట్టింది. ఇది తన అమ్మ చెప్పిన మాట అని రాసింది.
భర్త నాగ చైతన్య నుంచి అధికారికంగా విడిపోయాక సమంత రూత్ ప్రభు ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ చార్ ధామ్ యాత్రకు వెళ్లింది.
తాజాగా సమంత తాజాగా దుబాయ్‌కి వెళ్లింది. ఇటీవల ఆమె మరో ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది. అందులో ఏముందంటే… “మీ డబ్బును కుమార్తె పెళ్లి రోజు కోసం ఆదా చేయకుండా, ఆమె చదువు కోసం ఖర్చు చేయండి. ఆమెకు తనను తాను ప్రేమించుకోవడం నేర్పండి. ఆత్మవిశ్వాసాన్ని నేర్పించండి‘‘ అని ఆ పోస్టులో ఉంది.
దీన్ని బట్టి చూస్తే సమంతను సపరేషన్ బాగా హర్ట్ చేసినట్టుంది.