ఏపీలో జగన్ కోటరీయే ఆయన పతనాన్ని లిఖిస్తోందని చెప్పాలి.
ఏపీలో ఏ శాఖ మంత్రి పేరు అడిగినా సజ్జల అనే చెబుతారు.
ఎందుకంటే విద్యుత్ శాఖ గురించి ఆయనే మాట్లాడతారు. ఆరోగ్య శాఖ గురించి ఆయనే మాట్లాడుతారు. విద్యా శాఖ గురించి కూడా ఆయనే మాట్లాడతారు. ఒక్క కన్నబాబు శాఖ గురించి తప్ప అందరి గురించి సజ్జల మాత్రమే మాట్లాడుతారు.
అందుకే రఘురామరాజు ఆయనకు ‘సకల శాఖ మంత్రి‘ అని నామకరణం చేశారు. ప్రతిరోజు అన్ని విషయాలపై ఆయనే స్పందిస్తుండటంతో అసలు ఏపీలో ఏ శాఖకు ఎవరు మంత్రో అన్నది పక్కన పెడితే అసలు మంత్రులు ఎవరో కూడా పేర్లు చెప్పలేని పరిస్థితి జనాలది.
ఈ నేపథ్యంలో సజ్జల వ్యవహారంపై రఘురామరాజు తర్వాత డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త విషయాలు బయటకు వచ్చాయి.
సజ్జలపై పార్టీ నేతల్లో, మంత్రుల్లో భారీ అసంతృప్తి ఉందట. సమయం కోసం వారు వేచిచూస్తున్నారట.
ఎవరినీ లెక్క చేయకుండా సజ్జల తన ఇష్టానుసారం అధికారం చెలాయిస్తున్నారని పార్టీ నేతలు తీవ్ర వేదన, కోపంతో ఉన్నారట.
ఈ నేపథ్యంలో త్వరలో సజ్జలను సైలెంట్ చేసే పనిలో పడ్డారట జగన్ రెడ్డి.
సజ్జల వల్ల చాలా మంది మంత్రులు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేరు. వివిధ మంత్రిత్వ శాఖల కోసం మాట్లాడే ఏకైక వ్యక్తి సజ్జల రామకృష్ణ రెడ్డి మాత్రమే. సజ్జల అధికారికంగా ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. కానీ, ఆచరణాత్మకంగా, అతను వాస్తవ హోం మంత్రితో పాటు అన్ని శాఖల మంత్రి అని ఒక మంత్రి స్వయంగా కామెంట్ చేశారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మీడియాతో ఏమి చెప్పాలో మరియు ఏమి చేయకూడదో కూడా మంత్రులకు సజ్జలే నిర్దేశిస్తున్నాడట.
అమరావతి సచివాలయంలో ఉన్న ఏకైక విఐపి సజ్జల అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల, AP NGO మరియు సెక్రటేరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కూడా తన ఛాంబర్లో ఆర్థిక మంత్రి కూడా కనిపించలేదని ధృవీకరించారు.
వారిని కలిసింది కూడా సజ్జల మాత్రమే. సచివాలయంలో అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక వ్యక్తి సజ్జల.
ఇక సజ్జల ఉంటే పార్టీ నేతకు నచ్చడం లేదు. అలా అని సజ్జలను సైడ్ చేయడానికి జగన్ కి కష్టం. అందుకే ఆయన్నే ఏదో ఒక శాఖకు మంత్రిని చేసే పనిలో ఉన్నారట జగన్. చూద్దాం ఏం జరుగుతుందో.