మహేష్ గురించి ఆ కామెంట్ వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోల్లో అందం విషయానికి వస్తే అగ్ర తాంబూలం మహేష్ బాబుకే ఇచ్చేయాలి. 45 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంటాడు మహేష్. కొన్నిసార్లు గౌతమ్‌ను మహేష్ పక్కన చూస్తే ఇద్దరూ అన్నదమ్ములేమో అనిపిస్తుంది.

హీరోగా తొలి సినిమా నుంచే ‘అందగాడు’ అని గుర్తింపు తెచ్చుకున్న మహేష్.. ఇప్పటికీ ఆ ట్యాగ్‌ను కాపాడుకుంటున్నాడు. చివరగా కనిపించిన ‘సరిలేరు నీకెవ్వరు’లోనూ తనదైన అందంతో ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ చార్మింగ్ లుక్స్‌తో కనిపించే మహేష్‌కు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మామూలు అమ్మాయిల్లోనే కాదు.. సినీ తారల్లోనూ మహేష్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి కొత్తగా సాయిపల్లవి కూడా చేరింది.

ఈ టాలెంటెడ్ యంగ్ యాక్ట్రెస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్ అందం గురించి తెగ పొగిడేసింది. సాయిపల్లవికి సోషల్ మీడియాలో  ఏ కొత్త మహేష్ ఫొటో కనిపించినా.. దాన్ని జూమ్ చేసి మరీ చూస్తుందట. ఈ విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిందామె. ‘‘మహేష్ చాలా అందంగా కనిపిస్తారు. ఆయన చర్మంపై చిన్న మచ్చ కూడా ఉండదు. ఏ సమయంలోనైనా ఆయన చర్మం మెరిసిపోతుంటుంది. లుక్స్ విషయంలో ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా ఉంటాడు అని ఆశ్చర్యానికి గురవుతుంటాను అంటోంది సాయిపల్లవి.

ఆయన ఫొటోలను నేను తరచుగా జూమ్ చేసి చూస్తుంటాను. ఆయన చర్మంపై చిన్న మచ్చ కూడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది’’ అని సాయిపల్లవి మహేష్ అందం గురించి అతిశయంగా చెప్పింది. నటిగా తనకంటూ చాలా మంచి పేరు సంపాదించుకుని స్టార్ స్టేటస్ తెచ్చుకున్న సాయిపల్లవి మహేష్ అందం గురించి ఇంతగా పొగడ్డం విశేషమే. ప్రస్తుతం నాగచైతన్య సరసన ‘లవ్ స్టోరి’తో పాటు రానాతో కలిసి ‘విరాట పర్వం’ చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.