విరూపాక్ష సూపర్ సక్సెస్ తర్వాత సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరో చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) తొందరపడలేదు. ప్రస్తుతం అతను రెండు ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతున్నాడు. ఇంతలో ఆయన మహా శివరాత్రి మరియు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సాయి తన పేరును మార్చుకున్నారు.
మెగా హీరో తన పేరును సాయి దుర్ఘ తేజ్‌గా మార్చుకున్నట్లు ప్రకటించాడు. అతను తన మధ్య పేరును తీసేసి తన తల్లి పేరును జోడించి ప్రకటించాడు.
విరూపాక్షకు ముందు సాయి దుర్గ తేజ్ పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి అతని ఆలోచనలు మారిపోయాయి. అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఆ క్రమంలోనే ఈ పేరు మార్పు అని అంటున్నారు. న్యూమరాలజీ ప్రకారం ఈ పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది.