దేశంలో మొట్టమొదటి సారిగా ఒక ఎంపీపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సంచలనం అవుతోంది.
రాజద్రోహం కేసులో అరెస్టయిన RRR ను ఏపీ పోలీసులు కస్టడీ లో కొట్టారని ఆయన స్వయంగా ప్రతి పార్లమెంటు సభ్యుడికి లేఖ రాశారు.
రఘురామ కృష్ణ రాజు రాసిన లేఖకు ప్రతి ఒక్కరు దిగ్బ్రాంతికి గురై జగన్ సర్కారును తిడుతూ ఏపీ పోలీసులపై ఫైర్ అయ్యారు.
ఒక ఎంపీ పట్ల ఏపీ పోలీసులు ఇలా చేశారంటే ఇక సామాన్యుల పట్ల ఎలా వ్యవహరిస్తారో అని అందరూ ఆశ్చర్య పోతున్నారు.
మొన్న మాణిక్యం ఠాగూర్
నిన్న సుమలత అంబరీష్
ఆ లెటర్ ను ట్వీట్ చేస్తూ జగన్ సర్కారులోని పోలీసు వ్యవస్థను తీవ్రంగా తప్పు పట్టారు.
తాజాగా శివసేన ప్రముఖు నేత, ఎంపీ ప్రియాంక చతుర్వేది జగన్ సర్కారు ఆధ్వర్యంలోని పోలీసుల చేసిన ఘోరాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
Just shocked to read about the custodial torture of an elected MP @RaghuRaju_MP ji by the Andhra Pradesh Police. Implementing law and order is what they are assigned to do and not indulge in acts of violence. Hope state government ensures accountability of law keepers too. pic.twitter.com/4QRRvOAvca
— Priyanka Chaturvedi???????? (@priyankac19) June 4, 2021
మొత్తానికి రేపు దేశంలో ఏ నేత, ఏ పార్టీ వద్ద జగన్ ను తలెత్తుకోకుండా చేస్తున్నారు రఘురామరాజు. రాబోయే సమావేశాల్లో ఈ అంశాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. దీనికి ఎంపీలందరి మద్దతు (వైసీపీ తప్ప) లభిస్తుందని అందరూ అనుకుంటున్నారు.
ఈ లేఖ వ్యవహారంపై పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు