ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకులు, వైసీపీ పార్లమెంటు సభ్యుడు ‘కనుమూరి రఘు రామ కృష్ణంరాజు’తో అగ్రరాజ్యం అమెరికాలోని బే ఏరియా తెలుగు సంఘం నిర్వహించిన సమావేశం ఆహ్లాద భరిత వాతావరణం లో ముగిసింది.
జులై 2, ఆదివారం నిర్వహించిన సమావేశానికి భారీ సంఖ్యలో హాజరైన తెలుగు వారు ఆసాంతం ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ ‘రఘు రామ కృష్ణంరాజు’ మాట్లాడుతూ.. తెలుగు వారు ఎక్కడున్నా సంతోషంగా ఉండా లని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిణమాలు.. ఇతర అంశాలను ఆయన వివరించారు.
వైసీపీ పాలనలో పెట్టుబడులు రావడం లేదని.. ఉన్న పెట్టుబడి దారులు కూడా ఇతర రాష్ట్రా లకు తరలి పోతున్నారని చెప్పారు.
ప్రతి విషయంలోనూ అధికార పార్టీ నేతల జోక్యం పెరిగిపోయిందన్నా రు.
ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో తాను ప్రభుత్వంపైనా.. వైసీపీ నాయకులపైనా చేసిన విమర్శలకు గాను తనను సీఐడీతో అరెస్టు చేయించిన విషయాన్ని తదనంతరం జరిగిన పరిణామాలను కూడా.. ‘రఘు రామ కృష్ణంరాజు’ వివరించారు.
రాష్ట్రంలో ఒక విధమైన మాఫియా ప్రజల సొమ్మును దోచుకుంటున్న ట్టు వివరించారు.
ప్రతి సమస్యకు పరష్కారం ఉన్నట్టుగానే.. ఏపీలోనూ వచ్చే ఎన్నికల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
వైసీపీ నాయకులు ఏ స్థాయికి దిగజారి పోయారంటే నేను మూడున్నర సంవత్సరాల క్రితం జగన్ ప్రభుత్వం గురించి భీమవరంలో మాట్లాడిన ఒక పాత వీడియో ఇప్పుడు అమెరికాలో మాట్లాడినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు .
ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంది నా ప్రస్తుత పార్టీ. మళ్ళీ 25 పార్లమెంట్ స్థానాలు , 175 అసెంబ్లీ స్థానాలు మావే అని వెధవ పబ్లిసిటీ . సిగ్గులేని రాజకీయం. ఈ నిరంకుశ అరాచక దోపిడీ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించేది లేదు
ఈ సందర్భంగా బే ఏరియా తెలుగు సంఘం నాయకులు.. ఎంపీ ‘రఘు రామ కృష్ణంరాజు’ని ఘనంగా సత్కరించారు.
ఆదివారం సెలవు దినం కావడంతో నలుమూలల నుంచి అభిమానులు, తెలుగు వారు ఎంపీని చూసేందుకు వచ్చారు
. ఆహ్లాదభరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు.
ఎంపీ ‘రఘు రామ కృష్ణంరాజు’ ఉపన్యాసం అందరినీ ఆలోచింపజేసింది.