వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మహిళా మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చిన ఫలితాలతో ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ముఖ్యంగా ఏపీలో జగన్ ను ఆదరిస్తున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జగన్ రైతులను సకాలంలో ఆదుకుంటున్నారని..జగన్ సంక్షేమం అందిస్తున్నారని అన్నారు.
గడప గడపకు మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపిస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేకత కేవలం కల్పితమేనని చెప్పుకొచ్చారు. 2024 జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. విలేకరులు సీఎం జగన్ చేసిన బంగాళాదుంపలు-ఉల్లిపాయల కామెంట్లపై స్పందించాలని కోరినా.. రోజా మౌనం వహించారు. ఒత్తిడి, బాధలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు తడబడతారని.. దీనికే రాద్ధాంతం చేయాలా? అని ఎదురు ప్రశ్నించారు.