జనసేనకు తిరుపతి సీటు - రోజా


పవన్ కళ్యాణ్ పై రోజాకు ఉన్నంత కోపం ఎవరికీ ఉండదు. ఎందుకంటే గతంలో 2014లో వైసీపీ ఓడిపోయినపుడు పవన్ లేకపోతే మాకు అధికారం వచ్చేది అని ఏడ్చిన ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే రోజా. అందుకే ఆమె సందు దొరికితే పవన్ పై విమర్శలు ఆరోపణలు చేస్తుంటుంది.

తాజాగా పవన్ పై రోజా మరోసారి విమర్శలు చేసింది.పవన్ కళ్యాణ్ తన సొంత వాళ్లున్న రెండు చోట్ల ఓడిపోయారు. తిరుపతికి వచ్చి ఏం చేస్తారు? అని ప్రశ్నించారు రోజా. కేటీఆర్ చెప్పినట్లు జనసేన బీజేపీకి భజనసేన అని ఆమె విమర్శించారు.

ghmc ఎన్నికల్లో చూస్తే బీజేపీ కోసం జనసేన తప్పుకుంది. బీజేపీకి కొన్ని ఓట్లు పడాలి, టీఆర్ఎస్ ఓడాలి అంటూ ఎన్నికల నుంచి పవన్ వైదొలిగారు. ఇప్పుడు తిరుపతికొచ్చి పోటీచేస్తున్నారు... ghmc లో త్యాగం చేసినందుకు తిరుపతి సీటులో తన పార్టీ పోటీ చేయాలనుకుంటున్నారు అని ఆమె అన్నారు.

అయితే, ఈ సందర్భంగా రోజా ఒక విచిత్రమైన కామెంట్ చేశారు. ghmc లో వదులకుని తిరుపతిలో సీటు కావాలని పవన్ అన్నాడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని భావించాలా? అని ఆమె విచిత్రమైన ఆరోపణ చేశారు. ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటో ఆమే చెప్పాలి. ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి. గ్రేటర్ లో వదులుకున్నందుకు తిరుపతి సీటు అడిగితే అది పొత్తు అవుతుంది గాని మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా అవుతుంది అని రోజా ప్రశ్నించారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.