• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఓడిన సర్పంచ్ కి 2 కోట్ల కారు గిఫ్టుతో ఓదార్పా ? ఎందుకు?

సర్పంచ్ ఎన్నికల్లో ఓడాడు...  రూ.2.11 కోట్ల ఖరీదైన కారు గిఫ్టిచ్చి ఓదార్చారు

NA bureau by NA bureau
November 20, 2022
in Around The World, India, Politics, Top Stories, Trending
0
Rohtak Chidi Villagers Gifted 2 Crore Rupees And A Car To Defeated Sarpanch Candidate Ann

Rohtak Chidi Villagers Gifted 2 Crore Rupees And A Car To Defeated Sarpanch Candidate Ann

0
SHARES
160
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇప్పటి రాజకీయం ఎంత కరకుగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతానికి భిన్నంగా ఇప్పుడు రాజకీయం వ్యక్తిగత వైరానికి మించిన స్థాయికి చేరుకుంది. పవర్లోకి రావటం ఆలస్యం.. ప్రత్యర్థులపై విరుచుకుపడటం.. వారి ఆర్థిక మూలాల్ని దారుణంగా దెబ్బ తీయటం.. కోలుకోకుండా చేయటం.. ఒకవేళ ఈ దెబ్బలకు ప్రతిఘటిస్తే పోలీసు కేసులు పెట్టి మూయించటం.. లాంటివి తరచూ జరుగుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఒక సాదాసీదా ఎమ్మెల్యే వరకు చెప్పే మాటేమంటే.. రాజకీయ వైరం ఎన్నికల వరకే.. ఒకసారి ఎన్నికలయ్యాక అంతా ప్రజా శ్రేయస్సే అని చెబుతారు.

కానీ.. వాస్తవంలో జరుగుతున్నది మాత్రం అందుకు భిన్నం. అయితే.. తోపు నేతలు కూడా చేయని పనిని ఒక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గెలిచిన అభ్యర్థితో పాటు ఆ ఊరు వారు చేసిన పని ఇప్పుడు అందరూ మాట్లాడుకునేలా చేసింది.

హర్యానాలోని రోహ్ తక్ ప్రాంతంలోజరిగిన ఒక సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు కొత్త రాజకీయానికి తెర తీసేలా చేసింది. ఇంతకూ జరిగిందేమంటే.. రోహ్ తక్ జిల్లాలోని చిది గ్రామంలో ఇటీవల సర్పంచ్ ఎన్నిక జరిగింది. పోటాపోటీగా సాగిన ఈ ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.

అత్యంత సున్నితమైన ఈ పంచాయితీ ఎన్నికల్లో నవీన్ దలాల్ అనే అభ్యర్థి చేతిలో ధర్మపాల్ దలాల్ 66 ఓట్ల స్వల్ప వ్యత్యాసంతో ఓడారు. ఎన్నికల ఫలితం వచ్చాక ఊళ్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అన్న సందేహం వ్యక్తమైంది. ఇలాంటి వేళ.. గెలిచిన అభ్యర్థితో పాటు.. ఊరి ప్రజలు అంతా కలిసి ఆలోచించి.. ఓడిన ధర్మపాల్ కు రూ.2.11 కోట్ల విలువైన ఖరీదైన కారును బహుమానంగా అందజేయాలని నిర్ణయించారు.

ఓటమి వేదనతో ఉన్న ధర్మపాల్ కు ఊరి వారంతా కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ఆనందాన్ని కలిగించింది. ఓడి గెలిస్తే అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది? రాజకీయ విద్వేషాల్లో ఊరు రగిలిపోకుండా ఉండేందుకు.. ముందుచూపుతో వ్యవహరించిన గ్రామస్తుల్ని అభినందించాల్సిందే.

Tags: Chidi villageRohtaksarpanchSarpanch Candidate
Previous Post

“ఇదేం ఖ‌ర్మ‌“తో టీడీపీ ఏం చేయ‌నుంది?  స‌ర్వ‌త్రా ఆస‌క్తి!

Next Post

వైసీపీ అబద్ధాన్ని బద్దలు కొట్టేశాడు

Related Posts

nara lokesh yuvagalam1
Trending

యువ‌గ‌ళం ఎలా స‌క్సెస్ అవుతోంది… వైసీపీ అంత‌ర్మ‌థ‌నం …!

December 1, 2023
revanth and sanjay
Andhra

తెలంగాణ‌ .. గెలుపుపై ఏపీలో పందాలు…!

December 1, 2023
jagan pawan cbn
Trending

ఇక‌, ఏపీ వంతు.. 30 రోజుల్లో మారనున్న సీన్‌..!

December 1, 2023
Trending

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

December 1, 2023
Telangana

తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో ఏం జ‌రుగుతుంది..?

December 1, 2023
KCR
Trending

కేసీఆర్ కూ ఓటమి తప్పదా ?

December 1, 2023
Load More
Next Post
chandrababu with shoe

వైసీపీ అబద్ధాన్ని బద్దలు కొట్టేశాడు

Latest News

  • యువ‌గ‌ళం ఎలా స‌క్సెస్ అవుతోంది… వైసీపీ అంత‌ర్మ‌థ‌నం …!
  • తెలంగాణ‌ .. గెలుపుపై ఏపీలో పందాలు…!
  • ఇక‌, ఏపీ వంతు.. 30 రోజుల్లో మారనున్న సీన్‌..!
  • కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!
  • తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో ఏం జ‌రుగుతుంది..?
  • కేసీఆర్ కూ ఓటమి తప్పదా ?
  • చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం
  • కేటీఆర్ ఫుల్ ఫ్రస్ట్రేషన్
  • ఎగ్జిట్ పోల్…కేటీఆర్ కు రేవంత్ కౌంటర్
  • కేసీఆర్ సారూ..అలానే చేశారు!
  • కవితపై ఎఫ్ఐఆర్..రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
  • ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!
  • సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?
  • కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?
  • ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

బాబు అక్రమ అరెస్టు..ఆత్మరక్షణలో బీజేపీ!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra