తెలుగు సినిమా మెుదటిసారి విచిత్ర పరిస్ధితి ఎదుర్కొంటుంది. ఓ మెూస్తరు నటుడికి కూడా విఐపి ట్రీట్మెంట్ ఇచ్చే రాజకీయ నాయకులు, అధికారం ఇప్పుడు వాళ్ళ మీద పెత్తనం కోరుతున్నారు, మేం చెప్పిందే రేటు, వేసిందే ఆట అంటున్నారు. విడిగా ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కొరుకునే అగ్ర కధానాయకులు, వాళ్ల అభిమానులు ఈ పరిణామాలతో బిక్కబోయారు. సినిమాల రిలీజ్ అంటే ఏదో విదంగా తన పోటీదారుడి మీద ఓ నెగటివ్ వాతావరణం సృష్టించే పరిస్ధితి నుంచి ఒకరికొకరు మద్దతు ఇచ్చి తమ అభిమానులలో కాస్త దూకుడు తగ్గే వాతావరణం కల్పించారు.
ఇలాంటి పరిస్ధితిలో విడుదలైన ఓ అగ్ర కధానాయకుడి సినిమా అఖండ విజయం సాదించింది. దానికి పోటీ కధానాయకుల అభిమానులూ మద్దతు పలికారు. అన్నిటికి మించి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలతో అన్ని వర్గాలలో పెరిగిన అసంతృప్తి, దానిని వ్యక్తపరిస్తే కేసులు, దాడులతో భయబ్రాంతులు చేసే పాలెగాళ్ల ఫాసిస్ట్ పాలన వల్లకూడా ప్రజలు తమకోపాన్ని, ప్రభుత్వం అణచివేయాలనుకున్న సినిమా పరిశ్రమకు అఖండంగా విజయం ఆందించి వ్యక్తపరిచారని చెప్పుకోవచ్చు.
ఇది అధికారం చెలాయించే ఓ వర్గానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. రెండున్నరేళ్ళుగా ఎటు చూసినా సర్వం ‘తోక’మయం అన్నట్టు పైనుంచి కిందదాకా తమ ఫాక్షన్ వర్గం చేస్తున్న యాక్షన్ మీద ప్రజల తిరుగుబాటు మెుదలైందని ఆ వర్గం గుర్తించింది. రెండున్నర దశాబ్దాలుగా సినిమా హీరోల మద్య పోటీని కొన్ని కులాల మద్య వైరంగా చిత్రించి తమ కులపు రాజకీయ ఆధిపత్యం కోసం ఉపయెూగించుకున్న ఆ తోక పాలెగాళ్ల వర్గానికి ఇప్పుడు సినిమా అభిమానులు ఆ గీత చెరిపేసి మరీ ముందుకు వెళ్లడం మింగుడు పడని విషయం అయ్యింది.
సినిమా మీద తమ కుల మీడియా, వెబ్ మీడియా, కులకుష్టు పేటియం యూట్యూబ్ చానళ్లు, తోక వర్గపు వ్యక్తుల సోషల్ మీడియా వ్యక్తులు విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేసినా ప్రజల ఒక్కటవ్వడంతో వీళ్ల అసహనం పరాకాష్టకు చేరింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వస్తున్న పోస్టులు, విశ్లేషణలు, కామెంట్లు చూస్తే వీళ్ల కులకుష్టు ఏ మందులకు లొంగని స్థితికి చేరిందని అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు.
ముఖ్యాంగా మళ్లీ వీళ్లు ఎప్పుడూ నమ్మునే కుల రాజకీయాలకు తెరతీసారు, ‘సినిమా చూసేదంతా ఓ కులం వాళ్ళే’, ‘అమెరికాలో ఓ నగరం లో వచ్చిన వసూళ్లలో సగం ఓ కులం వాళ్లవే. విదేశాలలో కూడా వీళ్లు ఇలా కుల హీరోల సినిమాలు చూస్తారా? ఈ కులపు చేష్టల వల్ల అధికారం పోయింది’ అంటూ పుంఖాను, పుంఖాలుగ ఫాక్షన్ వర్గపు వెబ్, సోషల్ మీడియాలలో వస్తున్న ఆర్టికల్స్, పోస్టులు చెబుతున్నాయి వాళ్లు డిఫెన్స్ లో పడి మళ్లీ వాళ్లకు అలవాటయిన కుల చిచ్చులు రేపడానికి తెగబడ్డారని.
ఈ సినిమా విజయంతో కులకుష్టు వర్గం, వాళ్ల మెూచేతి నీళ్ళు తాగి ఒళ్లు పెంచి తటస్థ ముసుగులో ఉన్న జర్నలిస్ట్, విశ్లేషకులకు పని ఎక్కువైంది అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా ఓ రాష్ట్రంలో మద్య యుగాల పాలెగాళ్ల రాజ్యానికి నకలు చూపించి తెగబడుతూ, మరో రాష్ట్రంలో కూడా అధికారం కోసం ఎగబడుతున్న ఫాక్షన్ తోక వర్గానికి ప్రజలలో ఎదురుగాలి మెుదలైందని చర్తించుకుంటున్నారు.
– వ్యాసకర్త సీనియర్ సినీ, రాజకీయ విశ్లేషకులు