ఎవరి ప్రశాంత్ కిషోర్ ఈయనకు కాంగ్రెస్ కున్న సంభందం ఏమిటి? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలకు ఈయనకు సంబందాలు ఏమిటని మీరు ఆశ్చర్య పోకండి! జాతీయ స్థాయిలో బీజేపీని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపే ప్రక్రియలో జాతీయ రాజకీయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన కింగ్ మేకరే ఈ ప్రశాంత్ కిషోర్…! ఈయన ఏ రాజకీయ పార్టీ వ్యక్తి కాదు మత ప్రాతిపదికన దేశాన్ని విడగొడుతు, దేశ సంపదను కార్పోరేట్ల పరం చేస్తూ,బహుజనుల బతుకులు చిద్రం చేస్తున్న బీజేపీ అంటే ఆయనకు అసలు పొసకదు… అందుకే నిశ్శబ్ద రాజకీయ పునర్ ఏకీకరణ ఉద్యమం చేస్తున్నది ఈయనే…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ పదంలోకి తేవాలంటే ప్రాంతీయ పార్టీల దోస్తీ అవసరం అని చెప్పే ఈ ప్రశాత్ కిషోర్ పర్ములానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్, తమిళనాడు, కేరళ మరో రెండు రాష్ట్రాల్లో ఆయా కూటములను గెలిపించింది. రాహుల్ గాంధీ బావి ప్రధానిని చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్న ఈయన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం ప్రభావితం చేస్తున్నారంటే ఆయన రాజకీయ ప్రభ ఎలా వెలుగిపోతుందో అర్థం చేసుకోవచ్చు.
ఒకరు స్విచ్ వేస్తే… అక్కడ లైట్ వెలిగినట్టు…!? అక్కడ ప్రశాంత్ కిశోర్ స్విచ్ ఆఫ్ చేస్తే…!? ఇక్కడ రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ పోస్ట్ తటస్థంగా ఉండిపోయింది. రేపోమాపో రేవంత్‌కి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అనుకుంటుండగా.. ప్రశాత్ కిషోర్ ఎంట్రీతో రేవంత్ రెడ్డి కథ మళ్లీ మొదటికొచ్చింది. మీకు ఒక డౌట్ రాక మానదు ప్రశాంత్ కిశోర్‌కు, రేవంత్‌రెడ్డికి ఏం లింక్ అని… బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే అదే మరి. వింటానికి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది….10 జన్‌పథ్ నుంచి అందిన పక్కా సమాచారం ప్రకారం రేవంత్‌రెడ్డికే టీపీసీసీ ప్రెసిడెంట్ పేరు ప్రతిపాదన జరిగాక “కేసీఆర్ ప్రశాత్ కిషోర్”లు భేటి అయినట్లు విశ్వాసనీయ సమాచారం.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు సూత్రప్రాయంగా గులాబీ బాస్ కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ ల భేటీలో అంగీకారాన్ని తెలిపినట్లు తెలుస్తుంది. కాగా తాజాగా కేసీఆర్ రహస్య పర్ములానే రేవంత్ రెడ్డికి పీఠం దక్కకుండా చేస్తున్నట్లు కనిపిస్తుంది…? దేశంలో పార్లమెంట్ సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకే ప్రాంతీయ పార్టీల మద్దతు శరణ్యంగా భావిస్తున్న నేపద్యంలో ప్రశాత్ కిషోర్ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో రాజకీయ రాజీ బేరం మొదలు పెట్టడం గమనార్హం…!? ఈ నేపద్యంలో “మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు” తెలంగాణ పీసీసీ పీఠం రేవంత్ రెడ్డికి దక్కకుండా పోతుందేమో అని తల పండిన రాజకీయ వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం.
తెలంగాణ లో ఫైర్ బ్రాండ్ గా,కేసీఆర్ కి వెన్నులో వొణుకు పుట్టించాలి అంటే రేవంత్ రెడ్డికే సాధ్యం అనేది తెలుసుకున్న “ప్రశాత్ కిషోర్” రేవంత్ రెడ్డి వల్ల మీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం కనుక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టి రాష్ట్రంలో బీజేపీ దూకుడు తగ్గించండీ. ఎం.ఐ.ఎం,టి.ఆర్.ఎస్,కాంగ్రెస్ పార్టీలు కలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ స్మాష్ అవుతుంది? పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే సరిపోతుందనేది ప్రశాంత్ కిశోర్ సూచన…రహస్యంగా ఈ పర్ములను ఆమోదించి ఓకే చెప్పిన కేసీఆర్ రేవంత్ రెడ్డిని పీసీసీ ఇవ్వవద్దు అనే కండిషన్ పెట్టినట్లు తెలిసింది.
రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం కూడా ఇంట్రెస్టింగ్గా ఉందంటూ వార్తలు వచ్చినప్పటికీ అదిగో… ఇదిగో… అంటూ కాలక్షేపమే కానీ… రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం చేజిక్కడం లేదు. రేవంత్‌రెడ్డికి పీసీసీ దక్కకపోవడం వెనుక ఇన్నాళ్లూ స్థానిక కారణాలు వినిపించాయి… కనిపించాయి…. కానీ, లేటెస్ట్గా…రేపో… మాపో… ఇక ఫైనల్ అవుతుందని అనుకుంటుండగా… ప్రశాత్ కిషోర్ రూపంలో మరో చిక్కొచ్చి పడి రేవంత్ రెడ్డికి అశాంతి కలిగిస్తుంది.
ఎవరి ప్రశాంత్ కిషోర్…!?
బీజేపీకి వ్యతిరేకంగా ఈ మధ్యనే ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా రాజకీయ పునరేకీకరణకు పావులు కదుపుతున్నారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని కంకణం కట్టుకున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ కూటమి బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే శరద్‌పవార్‌తో అధికారిక చర్చలు ముగిశాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌లతో పాటు ఏపీ సీఎం జగన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్లతోనూ రహస్య మంతనాలు జరిగినట్టు సమాచారం. ఎంతటి నేపథ్యం ఉన్న ఈయనకు కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యత ఇవ్వడమే రేవంత్‌రెడ్డి పీసీసీ పీఠటానికి దూరం చేస్తుందని ఢిల్లీ రాజకీయ పెద్దలు అంటున్నారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్న ప్రశాంత్‌కిశోర్ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్రెడ్డిలను ప్రభావితం చేస్తున్నాడు. ఇక్కడ, అక్కడ ఈజీగానే పని పూర్తి చేసిన ప్రశాంత్ పట్ల కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఎక్కువైంది.
కేసీఆర్ కు కాంగ్రెస్ దోస్తీ అవసరం
ఇక తెలంగాణలో కేసీఆర్‌కు బీజేపీ పక్కలో బల్లెంలా మారడం కేసీఆర్ కు అసహనానికి గురి చేస్తోంది. మాజీ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నుంచి ఈటల వరకు టీఆర్ఎస్ అసంతృప్తులందరినీ కాషాయం పార్టీ అక్కున చేర్చుకుంటుండటంతో కేసీఆర్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అదే టైమ్‌లో ప్రశాంత్ కిషోర్ మెరుపు వేగం అందుకొని కేసీఆర్ దౌత్యం కోరడం మారుతున్న రాజకీయాల నేపద్యంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కేసీఆర్ రావడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఈ నేపద్యంలో కాంగ్రెస్ జట్టుతో ఈజీగా వచ్చే ఎన్నికల్లో తిరుగు లేని విజయం చేజిక్కించుకొని మల్లి ఈజీగా రాష్ట్రంలో గులాబీ ప్రభుత్వం నిలుపుకొని కొడుకును సీఎం చేసే పన్నాగంలో ఉన్నాడు.
ప్రశాంత్ కిషోర్ పర్ములానే భేష్..!
భవిష్యత్‌లో రాహుల్‌ను ప్రధాని చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తే… గతంలో మాదిరి యూపీఏతో కలిసి పనిచేసి.. కేంద్ర మంత్రి పదవులు అనుభవించినట్లే కేసీఆర్ కేంద్ర మంత్రి అయి దేశ రాజకీయాల్లో, యూపీఏలో కీలక నేతను చేసే అవకాశం కేసీఆర్ కు ఎర చూపినట్లు తెలుస్తోంది. ఎంత కాదనుకున్నా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌పై ఎక్కడో ఒక్కడా కేసీఆర్ కి అభిమానం లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో మోదీని ప్రభ తగ్గటం ఖాయమని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఇప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిని ప్రకటించే అవకాశం సంఘ్ పరివార్ చేస్తుండడాన్ని అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు అసలే మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై కేసుల బూచి చూపుతూ, కేసీఆర్ పై ఇప్పటికే కేసులు, జైలు అంటూ కమలనాథులు కేసీఆర్‌పై, ఆయన అనుచర ఎంపీపై కేసులు పెడుతూ దూకుడు మీద ఉన్న బీజేపీతో దోస్తీ కటీఫ్ చేసుకొనే దిశలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని బేరీజు వేసుకున్న గులాబీ బాస్…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసేందుకు ఓకే అన్నట్టు ప్రశాంత్ కిషోర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అత్యంత విశ్వసనీయ సమాచారం.
ప్రశాంత్ కిషోర్ చదరంగంలో రేవంత్ రెడ్డి బలి
కాంగ్రెస్ పార్టీతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలంటే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు ఇవ్వవద్దని కేసీఆర్ ఓ కండిషన్ కూడా పెట్టారట…? అదే రేవంత్‌రెడ్డికి ఇప్పుడు అడ్డొచ్చిన ప్రధాన సమస్య…కేసీఆర్‌కు తెలంగాణలో బద్దశత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రేవంత్‌రెడ్డి మాత్రమే. తనను జైల్లో పెట్టించినందుకు.. ఏనాటికైనా కేసీఆర్‌ను అదే జైల్లో కుక్కాలనేది రేవంత్‌రెడ్డి జీవితాశయం అనేది అందరు అనేదే…వినేదే…అందుకే, రేవంత్‌రెడ్డి ఎంత ఎదిగితే కేసీఆర్‌కు అంత మైనస్ రేవంత్ పీసీసీ చీఫ్ అయితే…!? ఇక నెక్ట్స్ స్టెప్ సీఎం కుర్సీనే…. అందుకే, రేవంత్‌ను మొదట్లోనే తుంచేలా.. కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ కు ముందస్తు కండిషన్ పెట్టారట. తాను కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయాలంటే.. రేవంత్‌రెడ్డి ప్రాధాన్యం తగ్గించాలనేది కేసీఆర్ షరతు. అయితే, కాంగ్రెస్‌తో మాట్లాడి చెబుతానని ప్రశాంత్ కిశోర్ అనడంతో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడం ఆలస్యం అవుతుంది.
రాహుల్ ప్రధాని కావాలంటే రెండు తెలుగు రాష్ట్రాలే కీలకం
వచ్చే సార్వత్రిక ఎన్నికలు హోరా హోరీగా ,పోరు ఉండటం ఖాయం. మోడీ లేని బీజేపీతో పోటీ వన్‌సైడ్ అయిన అదే టైమ్‌లో కాంగ్రెస్‌కు మిశ్రమ ఫలితాలు వస్తే అలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల మద్దతే కీలకం అవుతుంది. ప్రతీ ఒక్క ఎంపీ సీటు ప్రాధాన్యం ఆ లెక్కన తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో జగన్ మద్దతు తప్పకుండా అవసరం పడుతుందని “పీకే” కాంగ్రెస్‌కు నచ్చజెప్పారట.
తెలంగాణలో గులాబీ సపోర్ట్ కావాలంటే రేవంత్‌రెడ్డిని ప్రస్తుతానికి పక్కనపెట్టాలని ప్రశాంత్ కిశోర్ సూచించడంతో కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచనలో పడిందట. అప్పటికే టీపీసీసీ చీఫ్ పదవికి రేవంత్‌రెడ్డి పేరు ఖరారైనా “పీకే” ఎంట్రీతో ఆయన పేరు సైడ్ వేస్‌లోకి వెళ్లిపోయిందట.
ఎలాగూ సీనియర్లంతా మూకుమ్మడిగా రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో చీలిక వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక్క రేవంత్‌రెడ్డి కోసం అన్ని సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలనే అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చేసిందని భోగట్టా..?! భవిష్యత్‌లో కేసీఆర్‌తో ప్రయోజనాలు.. ఇటు వర్తమానంలో సీనియర్లతో అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు పీసీసీ చీఫ్ జాబితా నుంచి రేవంత్‌రెడ్డి పేరు తటస్థంగా ఉంచారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మధ్య మార్గంగా త్వరలోనే జీవన్రెడ్డినో, శ్రీధర్బాబునో పీసీసీ అధ్యక్షుడుగా ప్రకటిస్తారని తెలుస్తోంది… ఎక్కడ రేవంత్‌రెడ్డి.. ఎక్కడి ప్రశాంత్ కిశోర్.. ఇంకెక్కడి కేసీఆర్.. ఎవరో ప్రధాని కావడానికి.. ఇంకెవరి పీసీసీ పదవికో ఎసరు రావడం ఆసక్తిగా లేదు.. అందుకే అంటారు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని…?!
కేసీఆర్ ను నమ్మొచ్చా?
తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చేయకుండా మోసం చేసిన కేసీఆర్ ను మళ్ళీ నమ్మొచ్చా…!? అని కాంగ్రెస్ కురువృద్ద నాయకులు అంటున్నారు. రాజకీయ ఎత్తుగడల్లో ఆరి తెరిన కేసీఆర్ “నడి సంద్రంలో పుట్టి ముంచుడు ఖాయం”అని కొందరు అనుకుంటున్నారు. వాడుకొని వదిలేయడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య అని కేసీఆర్ రేవంత్ రెడ్డిని అడ్డుకొనేది అందుకేనని రేవంత్ రెడ్డి పని పూర్తి అయ్యాక కాంగ్రెస్ జవసత్వాలు లేకుండా చేసే కుట్రలో ఒక భాగమే కేసీఆర్ ఎత్తుగడలు అనేది పలువురు అంటున్నారు.