తెలంగాణ మంత్రి , ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ కి కోపం వచ్చింది. ఆయన రాష్ట్ర బీజేపీ నేతలను అదుపులో పెట్టుకోమని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేంద్ర సహాయ మంత్రి అయిన కిషన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
మీ వాళ్లను అదుపులో పెట్టుకోండి, ఎంతో సహనంతో ఉన్నాం. మా సహనం పరీక్షిస్తే ప్రధాని మోదీని కూడా వదిలిపెట్టం. మాట్లాడటం మాకూ వచ్చు – ఇది కేటీఆర్ కిషన్ రెడ్డికి ఇచ్చిన వార్నింగ్.
ఇక రేవంత్ రెడ్డిపై కూడా ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసలు లీడరే కాదు. ఆయన ఊరికే ఎగురుతున్నాడు. గతంలో టీడీపీలో ఉన్నాడు. ఇపుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. రేపు బీజేపీలో చేరతాడు.
అంతా బాగుంది కానీ బీజేపీలోకి రేవంత్ చేరుతున్నాడు అని కేటీఆర్ చెప్పడం ఏంటో. ఆ మాటకు వస్తే తన తండ్రి అప్పట్లో తెలుగుదేశంలో ఉండేవాడు. ఇపుడు టీఆర్ఎస్ పెట్టుకున్నారు. అలాగే రేవంత్ కూడా అదే తెలుగుదేశంలో ఉండేవాడు. ఇపుడు కాంగ్రెస్ లో ఉన్నారు. రేవంత్ ది కామెడీ అయితే కేసీఆర్ ది కూడా కామెడీయే కదా. చరిత్ర మరిచిపోయి పుసుక్కున అంటే మీడియాకు, జనానికి చరిత్ర గుర్తుంటుంది కదా కేటీఆర్ గారు.