సెల్ ఫోన్ గేమ్ ఆడుతూ ఓ చిన్నారి రూ.44 లక్షలు పోగొట్టుకుంది. ఇది అసాధారణంగా అనిపించవచ్చు, కానీ అది జరిగింది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోని అంబర్పేట్లో ఈ ఘటన జరిగింది.
బాలుడు మొదట్లో గేమ్ ఆడటానికి కొంత డబ్బును ఆన్లైన్లో పే చేశాడు. ఆ యాప్ తయారీకుల ఉద్దేశమో డబ్బులు దొబ్బడమట. అంతే మనోడు ఎలా పేశాడో… అదే మార్గంలో సైబర్ అటాక్ చేసి… 44 లక్షలు దొబ్బేశారు.
అరె అక్కౌంట్లో అంత డబ్బుందా అని అనుమానిస్తున్నారు కదా. ఆ పిల్లవాడు రిటైర్డ్ పోలీసు అధికారి మనవడు. మరి ఆయన అక్కౌంట్లో ఆ మాత్రం డబ్బుండదా?
ముందు ఈ కుర్రాడు తన సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్ కోసం మొదట రూ.1500 చెల్లించాడు. ఆపై 10 వేల చొప్పున 60 సార్లు డబ్బు పోగొట్టుకున్నాడు. ఇక్కడేదో వర్కవుట్ అయ్యేలా ఉందని కనిపెట్టిన యాప్ నిర్వహకులు… రిటైర్డ్ పోలీసు అధికారి ఖాతా నుండి నెట్ బ్యాంకింగ్ ద్వారా మెల్లగా పలు విడతలుగా 44 లక్షలను కొట్టేశారు.
ఈ కాలంలో డబ్బు తీసినపుడల్లా ఫోనుకు మెసేజు వస్తుంది కదా… ఒక్క సారి కూడా ఈ విషయాన్ని గమనించని పెద్దాయన… ఏదో అవసరం పడి బ్యాంకుకు వెళ్తే నిల్ బ్యాలెన్స్ చూపించిందట. అరె డబ్బులు ఏమయ్యాయి అని అపుడు సారుకు అనుమానం వచ్చింది. దొంగలు కనుక ఓ లక్ష అక్కౌంట్లో ఉంచుంటే.. అది కూడా పట్టించునేవాడు కాదేమో మరి. మహానుబావుడు.
ఈ ఘటనపై వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.