దూర ప్రాంతాలకు వెళ్లేవారికి.. మార్గమధ్యంలో ఎదురయ్యే టోల్ గేట్లు ప్రయాణ వేగానికి బ్రేకులు వస్తుంటాయి.
కొన్నిసందర్భాల్లో విపరీతమైన రద్దీ కారణంగా గంటల పాటు అక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది.
ఇకపై.. అలాంటి తలనొప్పులు తీరిపోనున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో రెండేళ్ల తర్వాత రోడ్ల మీద టోల్ గేట్లు కనిపించవు. ఈ మాట విన్నంతనే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అంతఅక్కర్లేదు.
ఎందుకంటే.. రోడ్ల మీద టోల్ గేట్లు కనిపించవు కానీ.. వాటి వసూళ్లు మాత్రం ఆన్ లైన్ లో యథావిధిగా కట్ అయిపోతుంటాయి.
ఎందుకంటే.. టోల్ వసూళ్లను కేంద్రప్రభుత్వం గ్లోబల్ పొజిషినింగ్ సిస్టం (జీపీఎస్)ద్వారా సాగుతాయి.
ఈ విషయాన్ని కేంద్ర రహదారి రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
కొత్త విధానంతో కలిగే ప్రయోజనం.. టోల్ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. వసూళ్లు ఎలా చేస్తారన్న విషయానికి వెళితే.. జీపీఎస్ ద్వారా ఒక వాహనం హైవేల మీద ప్రయాణించిన వెంటనే.. ఆ సమాచారాన్ని సేకరించి.. వారి బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేస్తారు.
అంటే.. ఎలాంటి నొప్పి లేకుండా.. అకౌంట్లో ఉన్న డబ్బుల్ని మినహాయిస్తుంటారు.
ఈ టోల్ గేట్ల ద్వారా కేంద్రానికి వచ్చే వసూళ్లు రూ.34 వేల కోట్లకు చేరతాయని చెబుతున్నారు.
టోల్ వసూళ్లను జీపీఎస్ విధానంతో వసూళ్లు చేయటం ద్వారా రానున్న ఐదేళ్లో రూ.1.34 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
కొత్త విధానంతో కలిగే ప్రయోజనం.. రద్దీ వేళల్లో టోల్ గేట్ల దగ్గర ఎక్కువసేపు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు.