పుత్ర శోకంతో ఉన్న ఏలూరు మాజీ ఎంపీ శ్రీ మాగంటి బాబు,రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో పరమపదించిన జస్టిస్ ఈశ్వర ప్రసాద్ కుటింబీకులను నరసరావుపేట మాజీ ఎంపీ శ్రీ రాయపాటిసాంబశివరావు గురువారంనాడు హైదరాబాద్ లో పరామర్శించారు.
అనారోగ్యంతో ఇరువురు పుత్రులను కోల్పోవాల్సి వచ్చిందని మాగంటి బాబు ఆవేదన వ్యక్తం చేశారు.అందరికి సాయం చేసే మంచి గుణం ఉన్న బాబుకు పుత్రశోకం తనకు బాధ కలిగిస్తుందని, పుత్రుల మరణ బాధ నుండి బాబు త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నట్లు,బాబుకు పూర్తి ధైర్యం చేకూరాలని రాయపాటి పేర్కొన్నారు.
తనకు ఎంతో ఆత్మీయంగా ఉండే జస్టిస్ ఈశ్వర ప్రసాద్ సతీమణి శ్రీమతి చామంతి కుమారుడు ఢిల్లీ ఇంకమ్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జాష్టి కృష్ణ కిశోర్,ఆయన సోదరులను రాయపాటి సాంబశివరావు పరామర్శించి, జస్టిస్ ఈశ్వర ప్రసాద్ చిత్రపటంపై పూలు వేసి నివాళులు అర్పించారు.
.