టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఈ జంట తొలిసారి `గీత గోవిందం`లో నటించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆన్‌స్క్రీన్ పై విజయ్-రష్మికల కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత `డియర్ కామ్రేడ్`లో మరోసారి ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోగా.. ఈ చిత్రం కమర్షియల్ గా పరాజయం పాలైంది. అప్పటినుంచి కలిసి మరో సినిమా చేయకపోయినా.. ఎప్పటికప్పుడు జంటగా కనిపిస్తూ టాలీవుడ్ లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్నారు.
కలిసి వెకేషన్స్ కు వెళ్లడం, డిన్నర్ డేట్స్, ఒకరింట్లో ఒకరు ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం, అందుకు సంబంధించిన ఫోటోలు లీక్ అవ్వడం.. ఇలా ఇప్పటివరకు చాలానే జరిగాయి. నేరుగా ఒప్పుకోకపోయినా పరోక్షంగా తమ రిలేషన్ పై విజయ్, రష్మిక ఎన్నో హింట్స్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. మే9న విజయ్ దేవరకొండ బర్త్‌డే కావడంతో ఆయనకు అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. విజయ్ కొత్త సినిమా అప్డేట్స్ కూడా వచ్చాయి.
రష్మిక మాత్రం కొంచెం లేట్ గా విజయ్ ను విష్ చేసింది. ఈ క్రమంలోనే విజయ్ కు తాను పెట్టుకున్న ముద్దు పేరును లీక్ చేసింది. నిన్న రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ ఫోటోను పంచుకున్న రష్మిక.. ` నేను మళ్లీ లేట్ గా చెప్తున్నాను అని తెలుసు కానీ హ్యాపీ బర్త్ డే విజ్జు.. నువ్వు నిత్యం సంతోషంగా, ఆరోగ్యంగా, నవ్వుతూ, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను` అంటూ వైట్ హార్ట్ సింబల్స్ తో పాటు ప్లవర్స్ సింబల్స్ పెట్టింది. రష్మిక పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. విజయ్ ను విజ్జు అని రష్మిక ముద్దుగా పిలవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే `సో క్యూట్.. మీరిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి` అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.