ఈ మార్చి 10న విడుదల అయిన రానా నాయుడు (Rana Naidu) నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. ఏంది నెట్ ఫ్లిక్స్ లో ఇలాంటి సిరీసా అన్నారు. కానీ తీరా చూస్తే రానా నాయుడు.. ఆస్కార్ తర్వాత అంతగా ట్రెండింగ్‌లో ఉన్నది ఇదేనేమో..?
ఎంత మంది ఎన్ని అన్నా.. కంటెంట్ ఊహించినట్లుగానే ఉంది.. నెట్ ఫ్లిక్స్‌లో మనం సంసారపక్షమైన సిరీస్‌లు ఊహించలేం కదా..? పైగా అటు రానా కానీ.. ఇటు వెంకటేష్ కానీ ఇదే చెప్పారు.
మొగుడు పెళ్లాలు కూడా కలిసి చూడొద్దని చెప్పినపుడే మనం అర్థం చేసుకోవాలి సిరీస్ ఎలా ఉండబోతుందో అని..!
వాళ్లలా చెప్పాక కూడా.. బూతులు ఎక్కువయ్యాయని నీతులు మాట్లాడటం తప్పే అవుతుందేమో..?
కంటెంట్ పరంగా చూసుకుంటే రానా నాయుడు గొప్పగా ఏం లేదు. సాదాసీదా ఫ్యామిలీ డ్రామానే డార్క్ విత్ ఎరోటిక్ టచ్‌తో చెప్పారు మేకర్స్.. దానికి నెట్ ఫ్లిక్స్ తోడవ్వడంతో డోస్ మరింత ఎక్కువైందంతే..
మొదటి 4 ఎపిసోడ్స్ చాలా స్లోగా ఉన్నాయి.. కథ ఎటు వెళ్తుందో.. కాన్సెప్ట్ ఏంటో అర్థమే కాదు..
అప్పటి వరకు ఎక్కువగా బూతు సీన్స్‌తోనే వెళ్లిపోతుంది సిరీస్..
5వ ఎపిసోడ్ నుంచి కథలో కాస్త వేగం పెరుగుతుంది.. కథనం కూడా బాగుంటుంది..
8, 9, 10 ఎపిసోడ్స్ బాగున్నాయి.. అక్కడే అసలైన రానా నాయుడు మెరిపిస్తారు. ఇలాంటి కారెక్టర్ ఎలా చేసాడు వెంకటేష్ అంటూ అంతా తెగ తిట్టేస్తున్నారు. కానీ ఆయనకు తెలియకుండా అయితే చేయలేదుగా.. రిస్క్ తీసుకున్నా నాగ నాయుడు పాత్ర బాగా చేసాడు.
రానా అయితే నెక్ట్స్ లెవల్.. రానా నాయుడు పాత్రలో బాగా నటించాడు.. ఆ సీన్స్ కూడా చేసాడండోయ్..
మిగిలిన కారెక్టర్స్ ఓకే.. నెట్ ఫ్లిక్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి..
ఓవరాల్‌గా రానా నాయుడు.. ఒక్కరే చూడండి.. ఒక్కరే ఉన్నపుడు చూస్తే ఇంకా బెటర్.
ఇక ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతోంది. రానా నాయుడు ఓటీటీలో రికార్డు వ్యూస్ (Rana Naidu recod views) సాధిస్తున్నది. ఈ సిరీస్ ను గత వారం రోజుల్లో 8 మిలియన్ల మందికి పైగా చూశారు.