మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా కడప అజ్మీర్ దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం చరణ్ దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. అయితే అయ్యప్ప మాలలో ఉండి రామ్ చరణ్ దర్గాకు వెళ్లడాన్ని చాలా మంది సమర్థించినప్పటికీ.. కొందరు మాత్రం తప్పుబడుతున్నారు. ఈ విషయంలో రామ్ చరణ్ ను ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన మెగా కోడలు ఉపాసన.. ట్రోలర్స్ నోరు మూసుకునేలా కౌంటర్ ఇచ్చింది. చరణ్ దర్గా సందర్శించిన ఫోటోను తన ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఉపాసన.. `విశ్వాసం అందర్నీ ఏకం చేస్తుంది, అదెప్పుడూ విడదీయదు. భారతీయులుగా మనం దైవానికి సంబంధించిన అన్ని మార్గాలను గౌరవిస్తాము. మన బలం ఐక్యత లోనే ఉంది. రామ్ చరణ్ ఎల్లప్పుడూ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తారు` అని రాసుకొచ్చింది. వన్ నేషన్ వన్ స్పిరిట్ అంటూ హ్యాష్‌ట్యాగ్ కూడా ఇచ్చింది.
ఇక ఉపాసన పోస్ట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. `మేడమ్ ఇతర మతాలను గౌరవించడం అంటే మీరు అయ్యప్ప మాలలో వారి దర్గాకు వెళ్లడం కాదు. వారి విశ్వాసాన్ని అవమానించకుండా వారి మతాన్ని గౌరవించవచ్చు` అంటూ కామెంట్ చేశాడు. అయితే సదరు వ్యక్తికి సైతం ఉపాసన ధీటుగా సమాధానం ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన `మసీదులో ప్రార్థనలు చేయడం శబరిమల ప్రత్యేక సంప్రదాయం` అనే శీర్షికను పోస్ట్ చేసింది. దీంతో ఉపాసన పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
Faith unites, never divides
As Indians, we honor all paths to the divine 🙏 our strength lies in unity. 🇮🇳 #OneNationOneSpirit #jaihind @AlwaysRamCharan respecting other religions while following his own 🫡 pic.twitter.com/BdW58IEEF9— Upasana Konidela (@upasanakonidela) November 19, 2024