టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్ – ఉపాసన జంట ఒకటి. పెళ్లై దశాబ్దం దాటిన ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటోన్న ఈ జంటకు 2023లో ఒక పాప కూడా జన్మించింది. ప్రస్తుతం రామ్ చరణ్ అటు ఫ్యామిలీ లైఫ్ ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇకపోతే `గేమ్ ఛేంజర్` ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రామ్ చరణ్ బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్` సీజన్ 4 లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫుల్ ఎపిసోడ్ బయటకు వచ్చింది.
బాలయ్యతో చరణ్ ఎన్నో కబుర్లు పంచుకున్నాడు. షోలో భాగంగా ఉపాసనను మొదటిసారి ఎప్పుడు కలిశావు? అని బాలయ్య ప్రశ్నించగా.. `వాళ్ల ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఉపాసనను చూశాను. మొదట్లో మేమిద్దరం ఎప్పుడు ఫైట్ చేసుకుంటూనే ఉండే వాళ్లం. ఆ తర్వాత ఆమెపై ప్రేమ కలిగింది. ఆమెకు కూడా అటువంటి ఫీలింగ్స్ ఉండడంతో పెళ్లి చేసుకున్నాము. తను నాకు చపోర్ట్ చేస్తుంది` అని తెలిపారు.
ఉపాసనలో అస్సలు నచ్చని అలవాటు ఏంటి? అని అడగ్గా.. చరణ్ బదులిస్తూ `ఆమెకు లేటుగా నిద్రలేచే అలవాటు ఉంది. ఆ ఒక్కటి నాకు అస్సలు నచ్చదు`అని చెప్పుకొచ్చాడు. ఇక ఆమె ఒక పని చేయాలి అనుకుంటే అది ఎంత కష్టమైనా చేసి తీరుతుందని భార్యపై చరణ్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా, సినిమాలు విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా `గేమ్ ఛేంజర్` సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న విడుదల అయింది. అయితే తొలి ఆట నుంచే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కనీసం మెగా ఫ్యాన్స్ ను కూడా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి.