రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు అనంత్ అంబానీ శుక్రవారం తన ప్రియసఖి రాధిక మర్చంట్ ను వివాహం చేసుకున్నారు. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వీరి రాయల్ వెడ్డింగ్ కు ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక అయింది.
అలాగే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పరిణయ మహోత్సవానికి దేశ విదేశాల నుంచి రాజకీయ, సినీ, క్రీడా మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు అతిథులుగా హాజరై సందడి చేశారు. మన టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల కూడా అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలో తళుక్కుమన్నారు.
రామ్ చరణ్ వైట్ కలర్ షేర్వాణీ సూట్ సెట్ ధరించి కనిపించగా.. ఉపాసన అందమైన గులాబీ రంగు పూలతో డిజైన్ చేపబడిన పాస్టెల్ గ్రీన్ చీరను ధరించి కనువిందు చేసింది. సంప్రదాయ దుస్తుల్లో మెగా కపుల్ ఎంతో అందంగా మెరిపిపోతూ ఫోటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
#RamCharan and wife #UpasanaKamineni arrive at #AnantAmbani and #RadhikaMerchant‘s wedding.#FilmfareLens #Trending pic.twitter.com/hgibyA78Qt
— Filmfare (@filmfare) July 12, 2024