ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హాస్పిటల్ పాలైంది. తనకు తానే సమస్యను కొనితెచ్చుకుని దాదాపు వారం రోజుల నుంచి బెడ్ పైనే అవస్థలు పడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫిట్ నెస్ కు రకుల్ ఎంతటి ప్రధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫిట్‌గా, హెల్తీగా ఉండటం కోసం నిత్యం ఎంతో కఠినమైన వ్యాయామాలు చేస్తూ చెమటలు చిందిస్తుంటుంది. అయితే రీసెంట్ గా జిమ్ లో 80 కిలోల బరువు ఎత్తడంతో రకుల్ నడుము నొప్పికి గురైంది.
అయినా పట్టించుకోకుండా వర్కవుట్స్ చేసింది. పైగా రెండు రోజులు షూటింగ్స్ కు వెళ్లింది. దాంతో నడుము నొప్పి తీవ్రతరంగా మారింది. వైద్యులను సంప్రదించగా.. వెన్నుముకకు గాయమైంది, బెడ్ రెస్ట్ చాలా అవసరం, లేకుంటే సమస్య మరింత సీరియస్ గా మారుతుందని చెప్పారట. వైద్యుల సలహా మేరకు రకుల్ చికిత్స తీసుకుంటూ బెడ్ కే పరిమితం అయింది.
ఇక తాజాగా సోషల్ మీడియా ద్వారా రకుల్ తన హెల్త్ అప్డేట్ ను షేర్ చేసింది. `హాయ్ ఆల్.. నేను వర్కవుట్ చేసేటప్పుడు చేసిన పిచ్చి పని వల్ల నా వెన్నుముకకు తీవ్రమైన గాయం అయింది. వెన్ను నొప్పి ఉన్నా పట్టించుకోలేదు. అది ఇప్పుడు ఎక్కువ కావడంతో చికిత్స తీసుకుంటున్నాను. గత ఆరు రోజుల నుండి బెడ్ మీదే ఉన్నాను. కోలుకోడానికి మరో వారం రోజులు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా బెడ్ మీద ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది. కానీ నాకు ఇదొక గుణపాఠం. మన బాడీ ఏదైనా సిగ్నల్ ఇచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లకూడదని నేను నేర్చుకున్నాను.
నా బాడీ కన్నా మైండ్ ఎక్కువ స్ట్రోంగ్ అని నేను ఫీల్ అయ్యాను. కానీ అన్నిసార్లు అది నిజం అవ్వదు. ఏదేమైనా నేను త్వరగా కోలుకోవాలి. నా ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు నాకు మెసేజ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు` అంటూ రకుల్ పోస్ట్ పెట్టింది. దాంతో రకుల్ ఫాస్ట్ గా రికవరీ అవ్వాలంటూ ఫ్యాన్స్ ఆకాక్షిస్తున్నారు.
Rakul Preet Singh injures back during 80 kg deadlift despite back spasm Wishing @Rakulpreet speedy recovery! Reminder: prioritize body safety over fitness or goals! #RakulPreetSingh #FitnessCaution #BackInjury #GymSafety pic.twitter.com/KSdbnekaVv
— MDApp (@MDAppMDApp) October 17, 2024