అనేక సంవత్సరాలు నాన్చిన తర్వాత ఎట్టకేలకు రజనీకాంత్ పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. తమిళ రాజకీయాల్లో కొత్త సంచలనం అంటున్నారు గాని చాలా కాలం నుంచి నాన్చడం వల్ల కొంత డ్యామేజ్ జరిగితే, ముఖ్యమంత్రి అభ్యర్థి తాను కాదు అని చెప్పి మరింత డ్యామేజ్ చేసుకున్నాడు రజనీకాంత్.
అవన్నీ పక్కన పెడితే పార్టీ అన్నాక ఒక గుర్తు, ఒక జెండా, ఒక పేరు ఉండాలి కదా.. తాజాగా పార్టీ పేరు, గుర్తులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల వీటిపై కసరత్తు చేస్తూ వచ్చిన రజనీకాంత్ ఒక క్లారిటీకి వచ్చారట. పార్టీ గుర్తును ఆటోగా పెట్టాలని నిర్ణయించుకున్నారట. పేరు విషయంలో కూడా క్లారిటీ వచ్చేసిందంటున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వివరాలివే…
పార్టీ పేరు – ‘మక్కల్ సేవై కర్చీ’ (ప్రజాసేవ పార్టీ)
పార్టీ గుర్తు – ఆటో
డిసెంబరు 31న వీటిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రజనీకాంత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా అర్జునమూర్తిని, సూపర్ వైజర్‌గా తమిళరువి మణియన్‌లను రజనీకాంత్ నియమించుకున్న విషయం తెలిసిందే.