తలైవా రజనీకాంత్ కు ఏమవుతోంది ? ఇదే ప్రశ్న ఇపుడెవరికీ అర్ధం కావటం లేదు. సినిమాషూటింగ్ నిమ్మితం హైదరాబాద్ కు వచ్చిన రజనీకి హఠాత్తుగా అనారోగ్యమన్నారు, వెంటనే ఆసుపత్రిలో చేర్పించేశారు. అంతే అప్పటి నుండి రజనీతో బయట ప్రపంచంతో సంబంధాలు దాదాపు తెగిపోయాయి. సినిమా యూనిట్ లోని ఓ ఎనిమిది మందికి కరోనా వైరస్ నిర్ధారణ కవటంతో అర్ధాంతరంగా షూటింగును నిలిపేశారు. ఇదే సమయంలో రజనీ కూడా మూడు రోజులు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళిపోయారు.
అయితే గురువారం కాస్త నలతగా ఉందని రజనీ అనుకున్నారట. శుక్రవారం ఉదయానికి అనారోగ్యం పెరిగిపోవటంతో వెంటనే అపోలో ఆసుప్రతిలో జాయిన్ చేసేశారు. అంతే తర్వాత నుండి రజనీ ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు చెప్పింది వినటమే. శనివారం మధ్యాహ్నానికి కూడా రజనీని ప్రముఖులెవరు కలవలేదు. శుక్రవారం మధ్యాహ్నం రజనీకి హై బీపీ కంట్రోలులో ఉండటం లేదని చెప్పిన వైద్యులు శనివారం రాత్రికి కూడా అదే చెప్పారు.
ఇక్కడే అందరికీ రజనీ ఆరోగ్యంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. 21వ తేదీన తలైవాకు కరోనా వైరస్ పరీక్షలు చేస్తే నెగిటివ్ అని వచ్చిందని సమాచారం. కాబట్టి కరోనా వైరస్ సోకలేదనే అనుకుందాం. మరి కేవలం హై బీపీ కారణంగానే రజనీని ఆసుపత్రిలో చేర్పించేశారా ? సరే ఓసారి డాక్టర్ కు చూపించుకోవాలని రజనీ అనుకున్నారనే కాసేపు అనుకుందాం. హైబీపీకి ఎవరైనా ఆసుపత్రిలో మూడు రోజులు ఇన్ పేషంటుగా చేరిపోతారా ? పైగా రజనీని ఎవరు కలవద్దని డాక్టర్లు ప్రకటించటమే విచిత్రంగా ఉంది.
కరోనా వైరస్ పేషంటని తెలిసిన తర్వాత కుటుంబసభ్యులే దగ్గరకు రారని అందరికీ తెలిసిందే. మరి హై బీపీ మాత్రమే ఉన్న రజనీని చూడటానికి ఎవరినీ ఎందుకు రావద్దని డాక్టర్లు ప్రకటించారు ? హైదరాబాద్ లోనే చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు లాంటి ఎంతోమంది రజనీకి అత్యంత సన్నిహితులున్న విషయం అందరికీ తెలిసిందే. మరి రజనీనికి చూసేందుకు ఎవరినీ రావద్దని డాక్టర్లు రావద్దని చెప్పారంటే సెలబ్రిటీలను కూడా రావద్దని చెప్పటమే కదా ?
దేశంలో కొన్ని కోట్లమందికి హై బీపీ ఉండటం చాలా సహజం. ఇంతోటి హై బీపీకే రోజుల తరబడి రజనీకాంత్ లాంటి ప్రముఖ సెలబ్రిటీని ఆసుపత్రిలో ఇన్ పేషంటుగా చేర్చేసుకున్నారంటే నమ్మేట్లు లేదు. ఇదే విషయంలోనే తమిళనాడులోని లక్షలాదిమంది అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎలాగూ చెన్నై నుండి రజనీ వచ్చింది ప్రత్యేక విమానంలోనే. మరలాంటి సౌకర్యం ఉన్న రజనీ ఓ రెండున్నర గంటలు ప్రయాణం చేస్తే చెన్నై వెళ్ళిపోయే సౌకర్యం ఉన్నపుడు మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఎందుకు అట్టేపెట్టేసినట్లు ? ఏమిటో ఏ విషయంలోనే సరైన క్లారిటి లేదు. అందుకనే రజనీతోనే ఓ వీడియో సందేశం ఇప్పిస్తే అయినా అభిమానులు ప్రశాంతంగా ఉంటారేమో.