ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ చేపట్టిన ఈ యాత్రకు అనూహ్యం స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ రాహుల్ చేస్తున్న ఈ పాదయాత్రకు పలువురు సినీ తారలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాహుల్ గాంధీ పాదయాత్రలో ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్న విజేందర్ సింగ్…. రాహుల్ గాంధీతో కలిసి నడిచాడు. మధ్యప్రదేశ్ లోని కార్గోన్ లో పాదయాత్రలో పాల్గొన్న విజేందర్ సింగ్ మీసం మెలేశాడు. అయితే, రాహుల్ గాంధీని కూడా మీసం మెలేయాల్సిందిగా విజేందర్ కోరాడు. దీంతో, రాహుల్ గాంధీ కూడా విజేందర్ తో కలిసి ‘తిప్పరా మీసం’ అంటూ మీసం మెలేశాడు.
రాహుల్ గాంధీతో కలిసి విజేందర్ మీసం తిప్పిన వీడియోను కాంగ్రెస్ శ్రేణులు భారత్ జోడో యాత్ర ట్విటర్ అకౌంట్లో షేర్ చేశాయి. దీంతో, ఆ వీడియోతో పాటు వారిద్దరి ఫొటో కూడా వైరల్ గా మారింది. అయితే, రాహుల్ మీసం తిప్పడాన్ని కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఆయన మద్దతుదారులు అభినందిస్తుంటే, బిజెపి నేతలు, మద్దతుదారులతో పాటు మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ వేసుకున్న టీ షర్ట్ పై కూడా బీజేపీ నేతలు వివాదం రేపిన సంగతి తెలిసిందే.
बॉक्सिंग रिंग के अजेय योद्धा @boxervijender आज आपने #BharatJodoYatra में सड़क पर उतरकर खेत-खलिहान और युवाओं की आवाज़ को ताकत दी है।
शुक्रिया आपका…🙏🏻 pic.twitter.com/4oZOFqPdp9
— Congress (@INCIndia) November 25, 2022