మెదడుకు మేతతో… ప్రశ్నలు గుప్పిస్తూ.. ఆన్లైన్లో సమాధానాలు రాబట్టే..`కోరా` వేదిక.. తాజాగా ఓ చిలిపి ప్రశ్న సంధించింది. దీనికి నెటిజన్ల నుంచి అంతే చిలిపి సమాధానం రావడం గమనార్హం. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..
“హిందూ ఆధ్యాత్మిక వేత్తలు తరచుగా.. దేవదేవుడైన శివుడు.. హిమాలయాల్లోని మౌంట్ కైలాశ్ లో ఉంటాడని చెబుతారు కదా.. మరి అలాంటప్పుడు.. ప్రపంచ దేశాలు ప్రయోగించే ఉప గ్రహాలకు ఆయన ఎందుకు అంతుచిక్కరు?“- ఇదీ ప్రశ్న.
ఈ ప్రశ్నకు అమెరికాలోని సెయింట్ లూయిస్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ అభ్యర్థి ఎఫ్ షాంత్ ఓ చమత్కారమైన సమాధానం ఇచ్చారు. ఈయన గడిచిన ముప్పై ఏళ్లుగా హిందూ ఆధ్యాత్మిక రంగానికి చెందిన సంబంధించి అనేక అంశాలపై ప్రాక్టికల్‌గా మేధోమథనం చేస్తున్నారు.
సాధారణంగా రాత్రి వేళల్లో కుక్కలు, పిల్లులు అనేక అంశాలను చూస్తాయి. కానీ, ఇవేవీ.. మానవుడి కళ్లకు గోచరించవు. అంతేకాదు.. రికార్డింగ్ సాధనాలకు కూడా అంతుచిక్కవు. ఈ క్రమంలోనే పరారుణ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే మానవుడి కళ్లకు కొన్ని పరిమితులు ఉన్నాయనే విషయం స్పష్టమైంది. ఈ క్రమంలోనే కంటికి కనిపించని సూక్ష్మ అంశాలను పరిశీలించేందుకు మైక్రోస్కోపులను కనిపెట్టారు.
అనంతర కాలంలో శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేసి.. పెద్ద పెద్ద మైక్రోస్కోపులను కూడా రూపొందించారు. ఇప్పుడున్న వ్యవస్థలో అత్యంత సూక్ష్మాతిసూక్ష్మమైన వస్తువులను కూడా గుర్తించేందుకు మైక్రోస్కోపులు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో వీటిని `క్యాట్` స్కాన్, `పెట్` స్కాన్, ఎంఆర్ ఐ స్కాన్.. ఇలా.. ఇప్పటి వరకు గోచరించని వాటిని తెలుసుకునేందుకు అనేక ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం.
శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే.. మాకంతా తెలుసు అని. చీకటిని ఛేధించామని..గతంలో కనని, వినని అనేక అంశాలను ఇప్పుడు వెలుగులోకి తీసుకువచ్చామని.. అంటారు. అంతేకాదు.. అంతరిక్షంలో 75 శాతం ఆక్రమించామని కూడా చెబుతారు. కానీ, ఇప్పటికీ.. మనకు తెలిసింది ఏంటంటే.. మనకు ఏమీ తెలియదని!!
“ప్రస్తుతం శిక్షణ పొందుతున్న శాస్త్రవేత్తగా నేను ఒక వాస్తవాన్ని పంచుకుంటున్నాను. కైలాస పర్వతం పై ఉంటాడనే శివుడు.. ఉపగ్రహాలకు ఎందుకు చిక్కరనే విషయాన్ని పరిశీలిస్తే.. శివుడిని చూడాలంటే.. మనకు ప్రత్యేకమైన నేత్రాలు అవసరం. ఒక్కసారి మనకు అలాంటి నేత్రాలు కనుక వస్తే.. శివుడిని ఒక్క కైలాస పర్వతంపైనే కాదు.. ప్రతివ్యక్తిలోనూ.. వస్తువులోనూ.. దర్శించవచ్చు. మహాదేవుడికి.. ఒక్క కైలాస పర్వతమే కాదు.. సమస్త విశ్వమూ.. ఆయన ఇల్లే!“
ఈ ప్రత్యేక నేత్రాలు పొందేందుకు.. మనసు, హృదయం, అంకితభావం, ఆత్మార్పణ.. వంటివి అత్యంత కీలకం. అది వచ్చిన తర్వాత, మిగిలినవన్నీ స్వయంచాలకంగా అమల్లోకి వస్తాయి.
*శివుడి గురించి ఒక అమెరికన్ ఇచ్చిన ఈ సమాధానం మిమ్మల్ని తన్మయానికి గురిచేస్తే దయచేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి*