శ్రీవల్లి పాట వచ్చేసింది.
సంగీత ప్రపంచాన్ని దున్నేసింది.
పుష్ప వంటి సినిమాలో ఇంత సున్నితమైన పాటనా అని అందరూ ఆశ్చర్యపోతూ మురిసిపోతున్నారు.
ఇందులో ఒక లైన్ గురించి మీకు కచ్చితంగా చెప్పాలి.
‘‘ఎర్రచందనం చీర కడితే.. రాయి కూడా రాకుమారే‘‘
చంద్రబోస్ వర్ణన ఎంత బాగుందో కదా.
‘చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే.. ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయెనే ఏ ఏ’..
ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినేట్టుగా ఉన్న ఈ శ్రీవల్లి పాట అభిమానులను అలరిస్తోంది.
కొద్ది సేపటి క్రితం విడుదలైన శ్రీవల్లి సాంగ్యూట్యూబ్ని షేక్ చేస్తుంది.
కింద పూర్తి లిరిక్స్ చదవండి. మీ ఫ్రెండ్స్ తో పంచుకోండి.
నిను చూస్తూ ఉంటె
కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావేచూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనేఅన్నిటికి ఎపుడూ… ముందుండే నేను
మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను
ఎవ్వరికి ఎపుడూ… తలవంచని నేను
నీ పట్టీ చూసేటందుకు… తలనే వంచానుఇంతబతుకు బతికి
నీ ఇంటి చుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు
చాలనుకున్నానేచూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏనీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగుంటావు
పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు
నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారుఎర్రచందనం చీర కడితే
రాయి కూడా రాకుమారేచూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే, ఏ ఏ
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ