బన్నీ సీక్వెల్ సినిమా `పుష్ప-2` తెలుగు సినీ ప్రపంచంలో ఒక రచ్చ రేపుతున్న విషయం తెలిసిందే. భారీ ఫాన్ ఫాలోయింగ్ ఉన్న బన్నీకి.. ఈ సినిమా.. మరింత క్రేజ్ పెంచేసింది. ఇక, థియేటర్ల వద్ద అభిమానుల తాకిడి మామూలుగా లేదు. పెద్ద ఎత్తున గుమిగూడుతున్న జనాలు ఒకవైపు… తమ అభిమాన హీరో కటౌట్ల కు దండలేసి.. సందడి చేస్తున్న వారు మరికొందరు.. ఇలా.. ప్రతి థియేటర్ వద్ద సందడి నెలకొంది. అయితే.. ఈ సదడి ఇలా ఉంటే.. మరో వైపు పొలిటికల్‌గా కూడా ఈ సినిమా హీటెక్కిస్తోంది.
పుష్ప-2 మూవీలో బన్నీ నోటి నుంచి వచ్చిన నాలుగైదు డైలాగులు ఏపీరాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఈ డైలాగులపై మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అయితే.. వీటిని ఉద్దేశ పూర్వకంగా రాసి ఉండరని. కేవలం కథను బట్టి రాసి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు. కానీ, ఈ డైలాగులు మాత్రం రాజకీయంగా దుమారానికి దారితీస్తున్నాయి.
పుష్ప 2′ సినిమాలో రచ్చ లేపుతున్న డైలాగ్స్ ఇవీ..
“ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్?.. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ష
“అనంతపురంలో గుండు కొట్టిస్తా”
“నువ్వెంత పావలా వాటా గాడివి“
ప్రధానంగా ఈ డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారంటూ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డి తరఫున ప్రచారానికి వెళ్లిన అల్లు ఆ తర్వాత రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి.. అల్లు ఇదే చర్చకు, రచ్చకు దారి తీశారు. చివరకు ఇది ఎలా ముగుస్తుందో చూడాలి. ప్రస్తుతం అయితే.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ డైలాగులు వైరల్ అవుతున్నాయి.