ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2: ది రూల్` చిత్రం విడుదలై నెల రోజులవుతున్నా ఇంకా థియేటర్స్ లో స్టడీగా కొనసాగుతూ ఎన్నో రికార్డులను తిరగరాస్తోంది. ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనే రేంజ్ లో ఇండియన్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. తాజాగా పుష్ప 2 మూవీ ముప్పై రోజుల కలెక్షన్స్ లెక్క బయటకు వచ్చింది.
30 రోజుల థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఏపీ మరియు తెలంగాణలో పుష్ప 2 మూవీ రూ. 222.15 కోట్ల రేంజ్ లో షేర్, రూ. 337.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 817.70 కోట్ల షేర్, రూ. 1,713 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. పుష్ప 2 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 617 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 620 కోట్లు కాగా.. బన్నీ ఈ టార్గెట్ ను ఎప్పుడో రీచ్ అయ్యాడు.
ముప్పై రోజుల్లో పుష్ప 2 చిత్రానికి ఏకంగా రూ. 197.70 కోట్లు లాభాలు వచ్చాయి. సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఎంతగానో అలరిస్తోంది. సంక్రాంతికి మరో వారం రోజులు సమయం ఉండటంతో అప్పటివరకు పుష్పరాజ్ హవా కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా, సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప 2లో రష్మిక హీరోయిన్ గా నటించింది. యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో మెరిసింది. బన్నీ కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా పుష్ప 2 నిలిచినా.. సంథ్య థియేటర్ ఘటన వల్ల ఆయనకు ఆ ఆనందమే లేకుండా పోవడం గమనార్హం.