పారిపోయిన 'పంచ్ రెడ్డి'

NRI
అమెరికా లో పశువుల వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ప్ర‌భాక‌ర్ రెడ్డి అలియాస్ 'పంచ్ ప్ర‌భాక‌ర్' తోక‌ముడిచారా?  ఆయ‌న చేసిన కామెంట్ల‌పై వివ‌ర‌ణ కోర‌గానే పారిపోయారా? అంటే.. ఔన‌నే అంటున్నారు. ఇటీవ‌ల 'హెల్ప‌ర్ ఫౌండేష‌న్' 'పంచ్ ప్ర‌భాక‌ర్‌'ను జూమ్ కాల్ ద్వారా పార్టిసిపేట్ చేయాల‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు కోరారు. ఆయ‌న రెడ్డి కులేత‌రులైన ద‌ళితులు, రాజ‌కీయ పార్టీల నేత‌ల‌పై చేసిన కామెంట్లు, కొన్ని యూట్యూబ్ పోస్టుల‌‌పై కొన్ని ప్ర‌శ్న‌లకు స‌మాధానం చెప్పాల‌ని కోరారు.  జూమ్ కాల్ కి వస్తానని ఒప్పుకొని చివరి నిమిషంలో భయపడి ముఖం చాటేయటం గ‌మ‌నార్హం.
వైసీపీ పార్టీకి చెంద‌ని నాయ‌కుల‌ను పందుల‌తోనూ, ఇత‌ర జంతువుల‌తోనూ పంచ్ ప్ర‌భాక‌ర్ పోలుస్తూ.. కామెంట్లు పెట్టారు. ముఖ్యంగా మైనార్టీల‌పై వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న దాడుల‌ను ఆయ‌న స‌మ‌ర్థించారు. ఆల‌యాల‌పై దాడులు, ద‌ళితులు, మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అకృత్యాల‌ను గుడ్డిగా స‌మ‌ర్ధించారు. వైసీపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై అనేక మంది ఆయ‌న‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అదేస‌మ‌యంలో మ‌హిళా వ‌లంటీర్లను కూడా ఆయ‌న దూషించ‌డంపై మండిప‌డ్డారు. మ‌రీ ముఖ్యంగా అమ‌రాతి రైతుల‌పై నోరు పారేసుకున్నారు.
ఈ స‌మావేశాన్ని 'హెల్ప‌ర్ ఫౌండేష‌న్ 'చైర్మ‌న్ 'య‌ల‌మంచిలి ప్ర‌సాద్' ప్రారంభించారు. ఆదివారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు ప్రారంభించిన స‌మావేశానికి ఫౌండేష‌న్ ప్రెసిడెంట్ 'కానురి శేషుబాబు' త‌దిత‌రులు కూడా హాజ‌ర‌య్యారు. వీరంతా 'పంచ్ ప్ర‌భాక‌ర్' కోసం ఎదురు చూశారు. అయితే.. ఆయ‌న మాత్రం దీనికి హాజ‌రుకాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ స‌మావేశంలో కువైత్‌, ఆస్ట్రేలియా, దుబాయ్ దేశాల నుంచి అనేక మంది పాల్గొన్నారు. అదే స‌మ‌యంలో భార‌త దేశంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పాల్గొన్నారు.
ఇక‌, ఈ స‌మావేశంలో వైజాగ్ ఉక్కు క‌ర్మాగారం విక్ర‌యం, ఉద్యోగులు ఉపాధి కోల్పోవ‌డం వంటి కీల‌క అంశాల‌పైనా చ‌ర్చించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ఇంత ద్రోహం చేస్తున్నా..అధికార వైసీపీ మాత్రం కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు తెలుపుతుండ‌డం, వారి అడుగుల‌కు మ‌డుగులొత్త‌టాన్ని కువైత్‌కు చెందిన 'వెంక‌ట్ కోడూరి', 'నాగేంద్ర‌బాబు' త‌దిత‌రులు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.