జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేల! అన్నట్టుగా.. ప్రపంచాన్ని చదివిని ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావుకు జాగ్రత్తలు తెలియదా? దాదాపు 50 ఏళ్లుగా ఈనాడు, ఇంతకు మరో పదేళ్లముందుగానే ప్రియ పచ్చళ్లు.. మార్గదర్శి వంటి సంస్థలను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్న ఆయనకు…ప్రజల నాడి తెలియదా..? వారి మనసులు తెలియవా? వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియవా? అంటే.. తెయవని ఏ ఒక్కరూ చెప్పలేరు.
అనేక మంది జీవితాల్లో వెలుగు దివ్వెలు వెలిగించిన రామోజీకి ఇప్పుడు.. వైసీపీ ప్రభుత్వం పాఠాలు నేర్పుతుండడం.. ఆయన సంస్థల్లో పెట్టుబడిదారులు.. చందాదారులకు జాగ్రత్తలు చెబుతుండడం.. `పిల్లకాకి` పాఠాలు చెప్పినట్టుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు పరిశీలకులు. కొన్ని నెలలుగా రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ విషయంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. ఈ సంస్థ ఏదో అక్రమాలకు పాల్పడుతోందంటూ.. కేసులు నమోదు చేయడం.. కోర్టులకు లాగడం వరకు వెళ్లారు.
సరే.. ఈ కేసులు కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి.. వాటి గురించి పక్కన పెడితే.. తాజాగా మార్గదర్శి గ్రూపులో చేరే, చేరిన చందాదారులకు `జాగ్రత్తల` పాఠాలు చెబుతూ.. ప్రజాధనం రూ.కోట్లు వెచ్చించి వైసీపీ సర్కారు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. నిజానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే రామోజీ తన చందాదారులకు భరోసా ఇస్తారా? ఇన్ని వేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎలాంటి తత్తరపాటుకు గురికాకుండా నిర్వ|హిస్తారా? ఈ చిన్న లాజిక్‌ను ప్రభుత్వం మరిచిపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
సర్కారు వారి `పాట` ఏంటంటే..
తెలుగు, ఇంగ్లీషు దినపత్రికలకు రూ. కోట్లు ఖర్చు చేసి ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనల్లో ప్రభుత్వం వారు.. కొన్ని విషయాలు వెల్లడించారు. వాటిలో ప్రభుత్వం ఏం చెప్పింది.. వాస్తవం ఏంటి? అనేది చూద్దాం..
ప్రభుత్వం: ఒక గ్రూపులో పాట పాడకున్నవారికి వేరే గ్రూపు నిధులు ఇస్తున్నారు.
వివరణ: ఏ గ్రైపు అనేది అనవసరం.. పాటపాడుకున్నవారికి డబ్బులు ఇస్తున్నారా? లేదా? ఏ సంస్థలో అయినా.. సర్దుబాట్లు కామన్. ఇది ప్రధానం కాదు.
ప్రభుత్వం: చీటీ పాడుకున్నవారికి డబ్బులు చెల్లించడం ఆలస్యం చేస్తున్నారు.
వివరణ: నిజమే సెక్యూరిటీ ఇవ్వడం ఆలస్యమైన సందర్భంలో అలానే ఏ సంస్థ అయినా చేస్తుంది.
కొసమెరుపు: సమస్యలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. కానీ, ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రాలేదు. మొత్తంగా చూస్తే.. ఇన్ని వ్యాపారాలు. సంస్థలను నిర్వహిస్తున్న రామోజీకి ఆమాత్రంజాగ్రత్తలు తెలియకుండానే చేయరనేది వాస్తవం. ఇక, సర్కారు వారి పాటలో ఎంత పస ఉందనేది రేపు కోర్టులే తేలుస్తాయి.
What ramoji saying about this :
https://www.eenadu.net/telugu-news/general/margadarsi-clarifies-on-ap-govt-allegations/0600/123135534
The Y.S.Jagan government released a front page ad attacking the Chit Fund company of media baron, Ramoji Rao!
This issue has been lingering since the days his dad was CM. Unusual attack this is. pic.twitter.com/8fcDlP7TiH
— S. Sudhir Kumar (@ssudhirkumar) July 30, 2023