లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయాలు అక్కర్లేదు. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఈ అందాల భామ కెరీర్ పరంగా తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. నటిగా కోట్లాది మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. అలాగే ప్రొఫెషనల్ మరియు పర్సనల్ లైఫ్ పై పలువురి నుంచి విమర్శలు, ఆరోపణలను కూడా ఎదుర్కొంది. తాజాగా నిర్మాత, యూట్యూబర్ అంతనన్ సైతం నయన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
గతంలో చాలా మంది నిర్మాతలు నయనతార వ్యవహారశైలి సరిగ్గా లేదంటూ నిప్పులు చెరిగారు. సినిమా ప్రమోషన్స్ కు రాదని.. షూటింగ్ టైమ్ లో సెట్స్ కు 8 మందితో కలిసి వచ్చి ప్రొడ్యూసర్స్ పై అధిక భారం పడేలా చేస్తుందని విమర్శించారు. అయితే యూట్యూబర్ అంతనన్ నయన్ గురించి ఇప్పుడు మరో కొత్త విషయాన్ని బయటపెట్టాడు.
`నయనతార తన పిల్లలతో షూటింగ్ లొకేషన్స్ కు వస్తుంది. ఆ పిల్లలను చూసుకునేందుకు ఇద్దరు ఆయాలను తనతో పాటు తీసుకొస్తోంది. ఆ ఆయాలకు కూడా నిర్మాతలే డబ్బులు చెల్లించాలని అంటోంది. అది ఎంత వరకు న్యాయం..? ఆమె పిల్లల నానీలకు డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత నిర్మాతలది కాదు. తన పర్సనల్ విషయాలపై కూడా నయన్ డబ్బులు సంపాదించుకోవాలని చూస్తోంది. అందుకే తన పెళ్లిని భారీ మొత్తానికి నెట్ఫ్లిక్స్ కు అమ్ముకుంది` అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో యూట్యూబర్ అంతనన్ నయనతారపై ఆరోపణలు చేశాడు.
ప్రస్తుతం అతని కామెంట్స్ సోషల్ మీడియాలో వరల్డ్ వైరల్ గా మారడంతో.. ఇది మరీ టూ మచ్ అంటూ కొందరు నెటిజన్లు నయన్ పై విరుచుకుపడుతున్నారు. అసలు అంతనన్ చేసిన ఆరోపణలు నిజమో కాదో తెలుసుకోకుండానే నయనతారను ట్రోల్ చేస్తున్నారు.