MAA ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు
MAA సభ్యత్వానికి తాను రాజీనామాను సమర్పించనున్నట్లు ప్రకటించారు.
గత 21 సంవత్సరాల నుంచి MAA తో అనుబంధాన్ని కలిగి ఉన్నానని మరియు తాను తెలుగులో సినిమాలు చేస్తూనే ఉంటానని చెప్పాడు.
తనను వివిధ నటులు నాన్ లోకల్ అని పిలిచారని, వారి అభిప్రాయాలను తాను గౌరవిస్తానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.
నాన్ లోకల్ అని పిలవబడిన తరువాత MAA తో కొనసాగే మూడ్లో లేనని అతను చెప్పాడు.
తనకు MAA లో సభ్యత్వం లేకపోతే తనను సినిమాలు చేయడానికి అనుమతించరా? అని ఆయన ప్రశ్నించారు.
మా ఎన్నికల ఫలితంతో ప్రకాష్ రాజ్ తీవ్రంగా హర్ట్ అయినట్లు అర్థమవుతోంది. ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు 100 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్ని భారతీయ భాషలలో సినిమాలు చేస్తున్నాడు. అతను అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు.
అయితే, నాన్ లోకల్ అంశం పక్కనపెడితే పార్లమెంటు ఎన్నికల్లో బెంగుళూరులో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఆ పొలిటికల్ కెరీర్ వైపు సీరియస్ గా ఉన్నపుడు మా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాల్సింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.