ఓ టాలీవుడ్ హీరో ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ కు కింగ్ అయ్యాడు. కపూర్లు, ఖాన్లు, బచ్చన్లను కూడా డామినేట్ చేసేశాడు. అతని సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే.. కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. తెలుగు ఇండస్ట్రీకి రెబల్ స్టార్, అభిమానుల డార్లింగ్ ప్రభాస్. కృష్ణం రాజు నటవారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. 2002లో `ఈశ్వర్` తో హీరోగా మారాడు. 2004లో రిలీజ్ అయిన వర్షం మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోల చెంత చేరిన ప్రభాస్.. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. దేశ, విదేశాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బాహుబలి మొదలు ఇప్పటివరకు అంటే తొమ్మిదేళ్లల్లో ప్రభాస్ నుంచి ఏడు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ జాబితాలో బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్క్లూజన్, సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్: పార్ట్ 1, కల్కి 2898 ఏడీ చిత్రాలు ఉన్నాయి.
టాక్ ఎలా ఉన్నా కూడా ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ప్రతి సినిమా తొలి రోజు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. అలాగే ఈ ఏడు సినిమాల టోటల్ బాక్సాఫీస్ వాల్యూ రూ.5300 కోట్లు. అంత తక్కువ సినిమాలతో అన్ని వేల కోట్లు రాబట్టడం ఇంతవరకు ఏ భారతీయ హీరోకు సాధ్యం కాలేదు. ఒక్క ప్రభాస్ మాత్రమే 7 చిత్రాలతో రూ.5300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను వసూల్ చేసి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. కాగా, ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో `రాజా సాబ్`, కల్కి 2, సలార్ 2, ఫౌజీ, స్పిరిట్ వంటి చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో రాజా సాబ్ ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
View this post on Instagram