అభిమానుల డార్లింగ్, బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే అని ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ఆయన గొప్ప మనసు తాజాగా మరోసారి బయటపడింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `రాజా సాబ్` ఒకటి. మారుతి డైరెక్ట్ చేస్తున్న హారర్ కామెడీ ఫిలిం ఇది. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా అల్లరించబోతున్నారు. చిత్రీకరణ ఆల్మోస్ట్ ఆఖరి దశకు చేరుకుంది. 2025 డిసెంబర్ 5న రాజా సాబ్ గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అయితే ప్రస్తుతం ఒక్కో సినిమాకు ప్రభాస్ రూ. 150 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కానీ రాజా సాబ్ కోసం ఏకంగా రూ. 50 కోట్లు వదిలేసుకున్నాడట.
మూవీ బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలపై ఎక్కువ ఒత్తిడి పడకుడదనే ఉద్ధేశంతో రూ. 100 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. తాజాగా ఈ విషయం తెరపైకి రావడంతో నువ్వు నిజంగా గ్రేట్ సామీ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, రాజా సాబ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టీజర్ జూన్ 16వ తేదీ ఉదయం 10 గంటల 52 నిమిషాలకు విడుదల కాబోతుంది.